ఇపుడిదే విషయమై సోషల్ మీడియాలో పెద్ద రచ్చ మొదలైంది. ఓటర్లను బురిడీ కొట్టించటానికి టిడిపి ఇస్తున్న ప్రకటనల్లో రాయలసీమలోని మారుమూలనున్న ఓ గ్రామానికి నీళ్ళు రావటమనే ప్రకటనపై పెద్ద రచ్చే మొదలైంది. ఎన్నికల వేడి బాగా రాజుకుంది కదా ? అందుకనే తెలుగుదేశంపార్టీ పెద్ద ఎత్తున అడ్వర్టైజ్ మెంట్లను విడుదల చేస్తోంది.

 

ఎన్నికల్లో జనాల మద్దతు కూడగొట్టేందుకు, ప్రజల ఆలోచనలను ఇతర పార్టీలపై నుండి డైవర్టు చేయటానికి టిడిపి పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తోంది. ఎన్నికలన్నాక ఇవన్నీ మామూలే అనుకోండి. ప్రజలనర భ్రమల్లో ముంచేసి ఓట్లు దండుకోవటంలో టిడిపికి మించిన పార్టీ మరోటి లేదన్నది వాస్తవం. తాజా ఎన్నికల సందర్భంగా టిడిపి తరపున టివిల్లో వస్తున్న ప్రకటనలు కూడా అందులో భాగమే.

 

ఇంతకీ విషయం ఏమిటంటే టిడిపి తరపున అనేక ప్రకటనలు వస్తున్నాయి. అందులో పొలాలకు నీళ్ళు రావటమన్న ప్రకటన కూడా ఒకటి. రాయలసీమలోని మారుమూల గ్రామానికి చంద్రబాబునాయుడు కృషి వల్ల నీళ్ళొస్తాయట. ఊరిలోని పంట పొలాలకు నీళ్ళు వచ్చినట్లుగా ఓ పెద్దాయన తన కొడుక్కి నీళ్ళు పారుతున్న దృశ్యాన్ని మొబైల్లో లైవ్ లో చూపుతారు.  

 

అయితే అదంతా గ్రాఫిక్స్ అంటూ ఓ యువకుడు చెప్పగానే నీళ్ళు పారుతున్న గ్రామం తాలూకు యువకుడు గ్రాఫిక్స్ అన్న యువకుడిని కొడతాడు. సరే నీళ్ళ గురించి, చంద్రబాబు కృషి గురించి, రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణం గురించి బ్రహ్మాండంగా లెక్చర్ ఇస్తాడు. ప్రతిదీ గ్రాఫిక్ అని కొట్టేయకుండా కాస్త విజ్ఞతతో ఆలోచించమని బుద్ది చెబుతాడు.

 

మారుమూల ప్రాంతాలకు కూడా నీళ్ళందిస్తున్న చంద్రబాబే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటూ ఆ యువకుడు గొప్ప ఉపన్యాసమే దంచుతాడు. రేపటి భవిష్యత్తు కోసం అందరమూ చంద్రబాబుకే ఓట్లేద్దామంటూ సూచిస్తాడు. సీన్ కట్ చేస్తే అదంతా ఒట్టి భూటకమంటూ ఓ నెటిజన్ సవాలు విసుతున్నారు. తాను కూడా కడప జిల్లాలోని పుల్లంపేట మండలంలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన యువకుడినే అని చెప్పాడు. 

 

చంద్రబాబు సిఎం అయిన తర్వాత ఇంత వరకూ తమకు ఎందుకు నీళ్ళు రాలేదంటూ ఓ వీడియోని పోస్టు చేశాడు. అంతేకాకుండా గాలేరు-నగిరి ప్రాజెక్టు పనులను కూడా నిలిపేశారంటూ చెప్పాడు. మారుమూల గ్రామానికి కూడా నీళ్ళొచ్చినట్లు టిడిపి చెబుతున్నదంతా గ్రాఫిక్స్ మాయాజాలమేనంటూ ఫైర్ అయ్యాడు. మరి టిడిపి ప్రకటన నిజమా ? లేకపోతే నెటిజన్ ఆరోపిస్తున్నట్లు అదంతా గ్రాఫిక్సేనా ? తేల్చుకోవాల్సింది జనాలే.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: