లోకేష్ ను ప్రతిపక్ష పార్టీలు అలాగే చాలా మంది "పప్పు" అని హేళన చేస్తుంటారు. దానికి కారణం లోకేష్ మాట్లాడే మాటలు అవతలి పార్టీ తిట్టబోయి తమ పార్టీనే తిట్టడం. ఒకటి చెప్పబోయి ఇంకొకటి చెప్పడం తో లోకేష్ ఘోరంగా ట్రోలింగ్ కు గురయ్యాడు. దీనితో ప్రతిపక్ష పార్టీలు లోకేష్ ను పప్పు అని సంబోధించడం మొదలు పెట్టారు. ఇది వరకే బంధు ప్రీతీ, కుల పిచ్చి ఏదైనా ఉందంటే అది టీడీపీ మాత్రమే అని సెలవిచ్చిన ఘనుడు లోకేష్. అంతేనా సైకిల్ గుర్తుకు ఓటేస్తే మన ఉరి మనమే వేసుకున్నట్టు అని చెప్పిన మేధావి లోకేష్ అని సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో ట్రోల్ అయ్యాడు. 


అంతే కాకుండా మంగళగిరిలో ప్రచారం చేస్తూ చాలా సార్లు నవ్వులపాలవ్వటం లోకేష్ ఇమేజ్ ను బాగా దెబ్బ తీసింది. ఎన్నికలు ఏప్రిల్ 11 అయితే ఏప్రిల్ 9 వేయాలని పిలుపునివ్వడం అది సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం మనం చూశాము. అయితే మంగళగిరిలో ఇప్పుడు లోకేష్ ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే గెలిచే స్థానం ఎంచుకోకుండా లోకేష్ అతి కష్టమైన అది కూడా టీపీడీ కి కంచు కోట కానటువంటి నియోజకవర్గాన్ని ఎంచుకోవటం గమన్హారం. 


ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో లోకేష్ పలు విషయాల మీద స్పందించారు. అయితే మిమ్మల్ని అందరూ పప్పు, పప్పు అంటే ఎలా అనిపిస్తుందని అడిగిన ప్రశ్నకు .. లోకేష్ స్పందిస్తూ వైసీపీ వారికి ఏం పని లేదు. అందరికి పేర్లు పెడుతుంటారు. ఐదేళ్లలో రాష్ట్రానికి 120 అవార్డులు . ఎన్నో కంపెనీలు అమెరికా నుంచి యూరప్ నుంచి తెప్పించానని అందుకు నన్ను పప్పు అంటే అననివ్వండి అని బాగానే సమాధానం చెప్పాడు. అయితే అన్ని అవార్డులు, కంపెనీలు నిజంగా వచ్చాయా అన్నది వేరే విషయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: