ఆంధ్ర ప్రదేశ్ ప్రయోజనాలే తమకు ఎపుడూ అతి ముఖ్యమని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాల మద్దతు తీసుకుంటామని ఆయన క్లారిటీగా చెప్పారు. తెలంగాణా రాష్ట్రం ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తామంటే తీసుకోవడం తప్పెలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.


.టీయారెస్ ని నిన్నటి వరకూ పొగిడిన చంద్రబాబు పొత్తుల దాకా వెళ్ళిన సంగతి మరచారా అని ఆయన నిలదీశారు. విజయననగరంలో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ,  తన సొంత బావమరిది హరిక్రిష్ణ శవాన్ని పక్కన పెట్టుకుని మరీ టీయారెస్ తో పొత్తుల కోసం వెంపర్లాడిన చరిత్ర బాబుది అన్నారు. ఆనాడు బాబుకు టీయారెస్ చాలా మంచిగా కనిపించిందని, ఇపుడు మాత్రం ఆయన అదే పెద్ద తప్పుగా మాట్లాడుతున్నారని అన్నారు. తాము టేయారెస్ తో ఎక్కడా  పొత్తులు పెట్టుకోలేదని,  ప్రత్యేక హోదా విషయంలో మద్దతు ఇస్తామంటే సరేనని అన్నామని ఆయన వివరించారు.


ఒక్క కేసీయారే కాదు. రేపటి రోజున ప్రత్యేక హోదా కోసం దేశంలోకి అన్ని రాష్ట్రాలకు తిరిగి మరీ హోదాను సాధిస్తామని బొత్స చెప్పుకొచ్చారు. హోదా వల్ల ఏపీ బాగుపడుతుందని నమ్మేది జగన్ అని అన్నారు. హోదాను తాకట్టు పెట్టిన చరిత్ర చంద్రబాబుది అని బొత్స విమర్శించారు. రేపటి రోజున కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా హోదా కోసం తాము షరతు పెట్టి మాత్రమే మద్దతు ఇస్తామని కూడా అయన స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: