ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రాన్ని చూస్తుంటే ఒక్కడిని చేసి మిగతా వారంతా రాజకీయ క్రీడను ఆడుతున్నట్టు తలపిస్తుంది. వైసీపీ అధినేత జగన్ ఒకపక్క అయితే మరోపక్క రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు చీకటిలో ఒకడిగా ఉంటూ ప్రజల మధ్య ఒంటరి పోరాటం చేస్తున్నట్టు నటిస్తున్నట్లు ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ క్రీడ ను బట్టి తెలుస్తోంది.


ఈ క్రమంలో తాజాగా ఇటీవల వైసీపీ అధినేత జగన్ కెసిఆర్ గురించి టిడిపి నాయకులు చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చే క్రమంలో చేసిన వ్యాఖ్యలను అధికార పార్టీ టిడిపి కెసిఆర్ జగన్ కుమ్మక్కయ్యారని ఆంధ్ర ప్రజల ముందు చిత్రీకరిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ద్రోహి జగన్ అని వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో చాలా మంది సీనియర్ నాయకులు సోషల్ మీడియాలో నెటిజన్లు..ఓటుకు నోటు కేసులో దొరికిపోయి ఆంధ్ర ప్రజలకు పది సంవత్సరాలు రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని విడిచిపెట్టి తన స్వార్ధ రాజకీయాలకోసం తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి చంద్రబాబు అప్పట్లో ప్రయత్నించలేదని ప్రశ్నిస్తున్నారు.


అయితే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ప్రతి ఒకటి అర్థం అవుతున్నాయని..ముందు నుండి ప్రత్యేక హోదా కోసం పోరాడుతూ రాష్ట్రానికి ముఖ్యమైన హామీ అయినా ఆ విషయంలో జగన్ నిలబడిన నేపథ్యంలోనే ప్రస్తుతం ప్రత్యేక హోదా అనే అంశం ప్రజల మధ్య ఉందని నెటిజన్లు మరియు సీనియర్ రాజకీయ నాయకులు కామెంట్లు చేస్తున్నారు.


అంతేకాకుండా ఒక్క జగన్ ని ఎదుర్కొనడం కోసం తెలుగుదేశం పార్టీ మరియు పవన్ కళ్యాణ్ , కే ఏ పాల్ కలసి ఆడుతున్న రాజకీయ క్రీడా ప్రతి సామాన్యుడికి అర్థమవుతుందని మరికొంతమంది నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికలలో జగన్ ఓడించడం కోసం ముసుగులో పొత్తులు పెట్టుకుని...మీరంతా ఆడుతున్న నాటకానికి త్వరలోనే ఆంధ్ర ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెబుతారని...పార్ట్నర్ రాజకీయాలు..కుళ్ళు కుతంత్ర రాజకీయాలకు త్వరలోనే ఆంధ్ర ప్రజలు తమ ఓటు ద్వారా ఎన్నడు మర్చిపోని విధంగా తీర్పు ఇస్తున్నట్లు పేర్కొంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: