వైసీపీ పార్టీ అధినేత కడప జిల్లాలో వైయస్సార్ పార్టీ కార్యకలాపాలను దగ్గరుండి చూసుకునే జగన్ సొంత బాబాయి వైయస్ వివేకానంద రెడ్డిని ఇటీవల కొంతమంది దుండగులు హత్య చేశారు అన్న సంగతి మనకందరికీ తెలిసినదే. ఎన్నికల ముందు వైఎస్ వివేకానందరెడ్డి మరణించడంతో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మరియు ప్రతిపక్షంలో ఉన్న వైసిపి పార్టీల మధ్య మాటల తూటాలు తారాస్థాయికి చేరుకున్నాయి.


ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న చంద్రబాబు వైయస్ వివేకానంద రెడ్డిని హత్య చేయించి రాష్ట్రంలో ఎన్నికలు రాకుండా మరియు రాష్ట్ర ప్రజల దృష్టిలో వైయస్ జగన్ ని హంతకుడిగా చిత్రీకరించే ప్రయత్నాలు జరపాలని చూశారని చాలా మంది నేతలు ఇటీవల కామెంట్లు చేశారు. ముఖ్యంగా తన తండ్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్యను అడ్డం పెట్టుకుని టీడీపీ అధినేత చంద్రబాబు... సొంత మనుషులను ఇంటివారిని దోషిగా చిత్రీకరించడానికి ప్రయత్నాలు చేశారని ఇటీవల వైయస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత మీడియా సమావేశం నిర్వహించి అనేక కామెంట్లు చేశారు.


 ఈ కేసును విచారిస్తున్న రాష్ట్ర దర్యాప్తు సంస్థ సిట్ పై తనకు నమ్మకం లేదని కామెంట్లు చేసిన వివేకానంద రెడ్డి కూతురు సునీత కేంద్ర దర్యాప్తు సంస్థ చేత విచారణ చేయించాలని కోరుకుంటున్న క్రమంలో ఇటీవల టీడీపీ అధినేత ఎన్నికల ప్రచారంలో భాగంగా వైయస్ వివేకానంద రెడ్డి హత్య గురించి తెగ ఊగిపోతూ కంగారుపడుతూ మాట్లాడుతున్న క్రమంలో...బాబుకి వివేకానంద రెడ్డి హత్య కేసుతో సంబంధాలు ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని..కేంద్ర ఎన్నికల దర్యాప్తు సంస్థ ఈ కేసులో ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా బాబు కు సంబంధించిన విషయాలు బయటకు వస్తాయని కొంతమంది మేధావులు కామెంట్లు చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: