ప్రజల్లో ముఖ్యంగా ఎన్నికల ముంగిట్లో పడ్డ వేళ రాష్ట్రమంతట విపరీత ప్రచారంలో ఉన్న అంశం కుల కాల కూట విషం చిమ్ముతున్న రాజకీయపార్టీ టిడిపి  అంటు న్నారు. ముందుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక సభలో తానే వ్యక్త పరచిన మాటలు ఈ అంశానికి సరిగ్గా ఊతం ఇస్తున్నాయని ప్రతిపక్షాలు బలంగా వాదిస్తున్నాయి. ఇందులో నిజమెంత?

kamma contractors pictures కోసం చిత్ర ఫలితం

సంబంధిత చిత్రం

కర్నూలులో జరిగిన ఒక సమావేశంలో ఏపి ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి వైసిపి నుంచి టీడీపీలో చేరిన సందర్భంగా మాట్లాడుతున్నప్పుడు అనుకోకుండా నిజం చెప్పేశారు.  ఆమె ప్రతిపక్షంలో ఉండి కూడా నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని తన కార్య క్రమాలకు వచ్చేవారని, వినతి పత్రాలను సైతం ఇచ్చేవారని, కాని తానే కొన్ని పనులు చేయలేదని, దానికి కారణం ఆమె వేరే పార్టీలో ఉండడమే నని ఆయన బహిరంగం గా వెల్లడించారు.


ఇతర పార్టీలలో ఉన్న శాసనసభ్యుల నియోజకవర్గాలకు చెందిన పనులు తాను చేయలేదన్న విషయాన్ని ఎక్కడా, ఏమాత్రం మొహమాట పడకుండా చెప్పేశారు. అదేదో గొప్ప విషయం అని అనుకున్నారు. కాని అది ప్రజాస్వామ్యంలో అత్యంత నీచమయిన వ్యవహారం. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికల వరకు వివిధ పార్టీల నుండి పోటీచేసి గెలిచిన వారు అధికారంలోకి వస్తారు. అధికారంలోకి వచ్చాక వారు ప్రజలందరకు అన్నీ పక్షాలకు చెందినవారౌతారు. ప్రజలందరికీ ప్రాంతాలు, కులాలు, మతాలు, స్త్రీ పురుష భాషలకు అతీతంగా ప్రజల సేవలు చేయవలసి ఉంటుంది. కాని దానికి విరుద్ధంగా పనిచేస్తున్నట్లు ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తానే చేస్తున్నట్లు చెప్పటం రాజ్యాంగ విరుద్ధం కాదా!

nandamuri balakrishna & sri bharat & Lokesh కోసం చిత్ర ఫలితం

ఆయన తన మాటల ద్వారా ఆదిలోనే రాజ్యాంగ విరుద్ధ చర్యలకు బీజం వేశారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను బలహీనం చేస్తూ అంటే గ్రామ సర్పంచ్‌ లు, మండల స్థాయిలో ఎంపీటీసీలతో సంబంధం లేకుండా తెలుగు దేశం పార్టీకే చెందిన "జన్మభూమి కమిటీ వ్యవస్థ" ను స్థానిక తెలుగు దేశం నేతల చేత ఎంపిక చేయబడ్డ తెలుగు దేశం కార్యకర్తలు మాత్రమే ప్రాతినిధ్యం మరియు నాయకత్వం వహిస్తుంటారు. కాబట్టి ప్రభుత్వ పథకాలు అమలు చేసేది అనుభవించేది జన్మభూమి కమిటీ సభ్యులే. దీంతో పెన్షన్‌ కావాలన్నా, రేషణ్ కావాలన్నా, ఆరోగ్య విద్యా సంబంధ ప్రయోజనాలు పొందాలన్నా జన్మభూమి కమిటీ సభ్యుల చుట్టూ తిరిగితే తాప ప్రభుత్వ సంభంతిత పధకాల ప్రయోజనాలు లభించవు. అంటే తెలుగుదేశం అధికారంలో ఉంటే ప్రభుత్వ పథకాల ద్వారా లభించే ప్రయోజనాలన్నీ తెలుగుదేశం నేతల నుండి క్రింది స్థాయి కార్యకర్త వరకు అందుతాయి. అంటే ఆ సమాజంలో ఉండే తెలుగుదేశం పార్టీకి చెందని వారికి ఎలాంటి ప్రయోజనం సిద్ధించని దుర్మార్గపు వ్యవస్థను చంద్రబాబు సృష్టించారన్నమాట.


ఇక ఈ జన్మభూమి కమిటీలు అవినీతి, బందుప్రీతి, కుల మత తదితర దుర్మార్గపు ప్రలోభాలకు ఈ సమాజాన్ని ఆలవాలం చేసి ప్రజలను పీడించుకు తినే పరిస్థితులతో నిపేశారు. అలాగే ప్రత్యర్థి పార్టీ వైసిపిలో ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా, బిజేపిలో ఉన్నా, తటస్థంగా ఉన్నా వారు ఎలాంటి ప్రభుత్వ సహాయం పొందలేని దుస్థితికి సమాజం బంధీ అయింది. ఒక రకంగా గ్రామాలలో అధికార పార్టీకి చెందని ఇతరులను నరకం చూపించారు, చూపిస్తున్నారు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధం. రాజ్యాంగ విరుద్ధం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇది ఒక ఆయాచిత సంపాదనకోసం ఉద్దేసించిన ఉపాది హామీ అన్నట్లు చెప్పవచ్చు. అంతే కాదు సమాజంలో తెలుగుదేశం వారైతేనే ప్రయోజనాలు లభిస్తాయి. మిగిలినవారు అక్కడ బ్రతకటానికి అనర్హులు అంటే చంద్రబాబు నాయుడు అనధికార మాఫియాలకు చంట్టం లోపల అంటే అంతర్లీనంగా అనుమతి ఇచ్చారన్నమాట.

nandamuri balakrishna & sri bharat & Lokesh కోసం చిత్ర ఫలితం

"జన్మభూమి కమిటీలు" అనేవి రాజ్యాంగ బద్ధమైనవి కావు. ఒక పార్టీ నిర్వహణకు ఆ పార్టీ ఏర్పరచు కున్న అనధికార వ్యవస్థ. అదే కాలనాగులా సమాజాన్ని చుట్టేసింది. సమాజంలో ఇలాంటి దారుణాలు జరగటానికి అవకాశం ఇచ్చిన చంద్రబాబు తాను కూడా అలాగే వైసిపి కాంగ్రెస్‌ శాసనసభ్యులకు ఒక్క పైసా  నిధులు ఇవ్వకుండా వారిని ఉక్కిరిబిక్కిరి చేశానని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇది అత్యంత దురదృష్టకరం. ప్రజాస్వామ్య విరుద్ధం. రాజ్యాంగ విరుద్ధం - ఒకపక్క ప్రధాని నరేంద్ర మోడీ తమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధమైన ప్రయోజనమూ చివరకు విభజన ప్రయోజనాలు ఇవ్వడం లేదని అనుక్షనం ప్రచారం చేసే టిడిపి అధినేత చంద్రబాబు తాను స్వయంగా తన ప్రత్యర్థి పార్టీల శాసనసభ్యులను నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టటం ఏ విధంగా నైతికమౌతుంది? ఏ విధంగా నీతిమంతమౌతుంది? అంటే కాకుండా ప్రతిపక్ష పార్టీల శాసనసభ్యులపై ఓడిపోయిన తన టిడిపి శాసనసభ్యుల పేర నిధులు మంజూరు చేసి, విడుదల చేసే చట్ట విరుద్ధ సంప్రదాయాన్ని కూడా ఆయన అమలులోకి తీసుకువచ్చారు. సమాజపు మూల వెరు నుంచి వృక్షాన్ని తినేసే అరాచకస్వామ్యాన్ని రాష్ట్ర వ్యాప్తం చేశారు చంద్రబాబు నాయుడు.


ఒక ముఖ్యమంత్రి, ఆయన మంత్రి మండలి ప్రాంతాలకు, మతాలకు, కులాలకు, లింగ వివక్షలకు అతీతంగా పనిచేస్తామని, రాగద్వేషాలకు చోటివ్వనిపాలన అందిస్తా మని పదవీ  ప్రమాణోత్సవం లో ప్రమాణం చేస్తారు. కాని చంద్ర బాబు ఆయన మంత్రి మండలి, ఆ పార్టీ నేతలు, క్రింది స్థాయి కార్యకర్తలు అంతా చట్టాలను రాజ్యాంగా లను, చేసిన శపథాలను ఇచ్చిన వాగ్ధానాలను ఉల్లంఘిస్తూ వచ్చారు. ఇది సభా ముఖంగా ఆయనే అంగీకరించారు. ప్రతి కీలక స్థానాల్లో తను ఎంపిక చేసిన వారినే నియమించారు. ప్రజా సంభంధ కార్యక్రమాల నిర్వహణ అంతా తను నియమించిన వారే నిర్వహిస్తున్నారు. అలాగే ఐటి మరియు ఐటీయేతర గుత్తేదార్లు అంతా తన ఆదేశాల ద్వారా నియమితులైన వారే. ఆఖరకు ఐటీ గ్రిడ్ అధినేత అశోక్ కూడా ఆయన కుమారుడు లోకేష్ అనుంగు సహచరుడే. అయితే సూక్ష్మ స్థాయి పరిశీలనలో వెల్లడైందేమంటే 90-98 శాతం అంతా చంద్రబాబు స్వంత సామాజిక వర్గానికి చెందిన వారే అని తేలింది.

galla jayadev కోసం చిత్ర ఫలితం

ఈ విధంగా తెలుగుదేశం పార్టీలోని కీలక స్థానాల్లోని వ్యక్తులే మూల వెళ్ళుగా ఏదిగిన కుల పార్టీ సమాజపు ప్రజాస్వామ్య పునాధులను కుల విషం నింపేయటం జరగగా మొత్తం సమాజంలో నాలుగు శాతం కంటే తక్కువ జన సంఖ్య ఉన్న ఆ సామాజిక వర్ఘం - సమాజంలోని ఆర్ధిక సామాజిక రాజకీయ సారాన్ని గుంజేసుకుంటుందని" విఙ్జుల విశ్లేషకుల పరిశోధన. దీనికి సాక్ష్యంగా కులం ప్రధానంగా ఎదిగిన రాజకీయ నాయకులు న్వతలు, సంపన్నులు, అధికారులు, కాంట్రాక్టర్లు, పారిశ్రామిక వేత్తలు, మీడియా టైకూన్లు అందరిని టాప్ ఫిఫ్టీ ని పర్శీలించండి. ఈ సమాజంలో కులం ఊతంగా ఎదిగిన వారు ఏ కులాల వాళ్ళో తెలుస్తుంది. "ప్రతిభ ఒకడి అబ్బ సొత్తు కాదు - ఒక కుల ఆధీనం లోది కాదు"


మన తెలుగు సమాజంలోని ఇవే రెండు మూడు కులాలు కుల కలుషితం కాని అమెరికా సమాజంలో చేరి అక్కడ కూడా కులస్వామ్యాన్ని ఇతోధికంగా అభివృద్ధి చేశారు చేస్తున్నారు. కుల కాలకూటంతో కలుషితమైన ఈ రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య సమాజాన్నే విషపూరితం చేస్తాయనటంలో సందేహం లెదు. ఇప్పుడు ఏపి ప్రజలు విఙ్జతతో ఈ ఎన్నికల్లో వ్యవహరించటం జాతికి కీలకం.

సంబంధిత చిత్రం

వేరే కులాల వారెవ్వరి పనులు జరగక పోవటంతో ఆ సామాజిక వర్గాలలో ఇప్పుడు తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదని, కుల స్వామ్య ప్రభుత్వం అన్న బావన ఇతర కులాల వాళ్ళతో పాటు అన్ని మతాల వాళ్ళలో ప్రఘాడంగా ఏర్పడింది. ముఖ్యంగా రాజధాని అమరావతి లో జరిగే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాల తీరు  ఒక ఆధిపత్య కుల సమాజానికే అత్యత విస్తృత ప్రయోజనాలు జరగగా - మిగిలిన సామాజికవర్గాల వారిలో మితిమీరిన ఆగ్రహజ్వాలలు విద్వేషాగ్ని రగలటానికి దోహదం చేశాయి. 


దీనికి తోడు టీడీపీ లోకి రాని వారికి పైసా కూడా అభివృద్ధి నిధులు అందవని  చంద్రబాబు తేల్చి చెప్పిన తీరు - ఆయన నలభై ఏళ్ల రాజకీయ జీవితం వెనుకనున్న కుల నేపధ్యం “పెద్ద కుల మచ్చ” గా సకల జనావళికి కనిపిస్తుంది. అంతేకాదు. కొందరు శాసనసభ్యులను పార్లమెంట్ సభ్యులను వారి వారి బలహీనతల ఆధారంగా కొందరికి కోట్లాది రూపాయలు ముట్టజెప్పారు. మరికొందరికి మంత్రి పదవులు ఇచ్చి ప్రలోభ పెట్టారు. ఇంకొందరి చరిత్ర లోని రౌడీ షీట్లు, పాత కేసులు వెలికి తీస్తామని చెప్పి వణుకు పుట్టించారు.

caste mark on TDP forehead  కోసం చిత్ర ఫలితం

ఉదాహరణకు నంద్యాల దివంగత శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసుపెట్టించారు. ఆయన రౌడీషీట్‌ ముగిసిన అద్యాయ మైనా దాన్ని తిరిగి తెరిచారట. చివరకు చెఱసాల పాల్జేసి కొద్ది రోజులకు ఆయన దిగివచ్చి టీడీపీలోకి రావటం తప్పని సరి చేశారని అందరూ అంటున్నారు. పైగా మంత్రి పదవి ఇస్తామన్నారట. చివరికి అది ఇవ్వకపోవడంతో ఆయన కేసుల చిట్ఠా భయంతో వత్తిడి చేయలేక – ఇబ్బంది పడి గుండెపోటుతో మరణించారు. ఇదంతా కుల వివక్ష కారణంగానే జరిగిందని విఙ్జుల  విశ్లేషణ. అలాగే మిగిలిన కాపు, బీసీ, అగ్రకుల వర్గాలను సైతం ఆదరించిన దాఖలాలు లేవు. ఒక చంద్రబాబు స్వకులం మాత్రమే సకల సామాజిక సారాన్ని జుర్రేసుకుంటూ వస్తుంది. ఒకవేళ స్వల్ప సంఖ్యలో ఇతర కులాల వాళ్ళు ప్రయొజనం పొందినా అందులో అధినేతల వాటా ఉందన్నది నిర్వివాదాంశం అని అంటున్నారు.


కాపు ఉద్యమ సమయంలో కాపులను ఎలా అవమానించింది చూశాం. ఇక బీసీలలో గౌడ, నాయిబ్రాహ్మణ, మత్సకార వంటి కులాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడిగినందుకు వారిని ఎలా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలివిజన్ల సాక్షిగా వారిని దూషించిన తీరు అవమానించిన ఘట్టాలు జగద్విదితమే. “ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?” అని వారిని అవమానించారు. అలాగే కోడలు కొడుకును కంటానంటే అత్త వద్దంటుందా? అంటూ మహిళలను కించపరచటం చంద్రబాబుకే చెల్లింది.

rape charges on TDP MLAs కోసం చిత్ర ఫలితం

అదే సమయంలో కులాభిమానం అసలు లెదని నిరూపించుకునే అవకాశం ఉన్నా - కమ్మ సామాజిక వర్గంలో నేఱస్తులపై చర్యతీసుకున్న సంఘటనలు – జరిగిఉంటే ప్రజాభిప్రాయం తప్పు అని చెప్పవచ్చు. కాని అవకాశం వచ్చినా తమకు కులపిచ్చి లేదని ఋజువు చేసుకోలేదు. ఉదాహరణకు జగమెరిగిన   దెందులూరు  నియోజక వర్గ శాసన సభ్యుడు చింతమనేని ప్రభాకర చౌధరి ఎన్ని అరాచకాలకు, అకృత్యాలకు పాల్పడినా ముఖ్యమంత్రే సమర్ధించిన పరిస్థితి రాష్ట్రంలో బాధాకరమే కాదు ప్రభుత్వాని కి అధికార పార్టీకి కుల వివక్ష అనంతం అని నిరూపిస్తున్నాయి జరిగిన సంఘటనల పరంపర.“దళితులకు రాజకీయాలు ఎందుకు, పదవులు ఎందుకు?అన్నప్పు డు కూడా ఆయనను మందలించలేదు.


ఇక ధర్మవరం ఎమ్మెల్యే సూరి చేసిన వ్యాఖ్యలు మరీ ఘోరం. ఎన్నికలలో గెలిపించండి. ఆ తర్వాత ఆరునెలల సమయం ఇస్తారట. అప్పుడు మీ ఇష్టం వచ్చిన ఎవరి నైనా చంపుకుంటారో? నరుక్కుంటారో? మీ ఇష్టం అన్న బహిరంగసాక్ష్యం ఉండనే ఉంది. చివరకు పోలీసులు మీజోలికి రాకుండా చూస్తామని చెప్పినా తెలుగుదేశం పార్టీ కనీసం స్పందించలేదు సరికదా ప్రభుత్వం చట్టపరంగా చర్య తీసుకోలేదంటే ఈ తెలుగు సమాజంలో కుల కాల కూట విషం నరనరాల్లోకి చేరిందని తెలుస్తుంది.


ఇక్కడ మరో కోణం కూడా ఉంది. వైసిపి శాసనసభ్యులు 2014లో అత్యధికం రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో గెలవగా వారెవ్వరి నియోజక వర్గాల అభివృద్ధికి నిధులు ఇవ్వకపోవడం, అభివృద్ధి పనులు చేయక పోవడం వల్ల ఆ ప్రాంతం  తీవ్ర కుల వివక్షకు గుఱై అన్యాయమై పోయిందన్న అభిప్రాయం జనం లో తీవ్రంగా ఏర్పడింది.

సంబంధిత చిత్రం

చంద్రబాబును ఎవరూ ఓడించలేరని ఆయన చెప్పుకుంటున్నారు. అదినిజమే  ఆయన్ను ఎవరూ ఓడించలేరు కాని ఆయన స్వయంకృతాపరాధాలే ఆయనను 'బస్మాసురుడు' గా తెర్చిదిద్దాయి. గత ప్రణాళికా కాలాల్లో ఆయన ఇలాంటి నీచమైన ఘోరమైన, హీనమైన, సంకుచితమైన పనులు చేశారని చెప్పలేము. ఈసారి మాత్రం ఆయన పూర్తి సంకుచితంగా మారి ఇలాంటి మతి మాలిన పనులు చేసి తన తనయుణ్ణి తెలుగుదేశం పార్టీ అధికార పీఠంపై ఆ తరవాత ముఖ్యమంత్రి గా ఆశీనులను చెయ్యాలంటే సమాజాన్ని చిన్నాభిన్నం చేయక తప్పదనుకున్నారు పలితంగా తెలుగు దేశం పార్టీకి, ఆ ప్రభుత్వంపై తొలిగించలేని “కుల కాల కూట విష ముద్ర” పడిపోయింది.

 

అనుభవం లేకపోయినా వైఎస్ జగన్మొహనరెడ్డి అధికారంలోకి రానున్నారని అనేక జాతీయ ప్రాంతీయ సర్వేసంస్థలు చెపు తున్నాయి అంటే సమాజంలో అంతర్లీనంగా కుల వ్యతిరేక్షత ఏ స్థాయిలో ఉందో చెప్పొచ్చు. ఇప్పుడు చాప కింద నీరులా  వ్యాపిస్తున్న అనధికార కుల ఐఖ్య సంఘటన ఖచ్చితంగా చంద్రబాబు నాయుడి ప్రభుత్వాన్ని సమాధి చేసే తరునంలో ఆయన స్వంత సామాజిక మీడియాతో పాటు సామాజిక వర్గం కూడా సమాజంలో ఒంటరివైపోయేది కఠిన వాస్తవం.


చివరకు జనం ఆలంబన చేసుకుంటున్న జనసేనాధినేత పవన్ కళ్యాణ్ – సమర్ధుడు, సచ్చరితుడు అన్న పేరున్న సిబీఐ మాజీ సంయుక్త సంచాలకులు వివి (జెడి)  లక్ష్మినారాయణ కూడా మంచి సమాజాన్ని మంచి పాలన ఇస్తామని చెప్పి సమస్త ఏపి జనావళిని కలుషిత రాజకీయ ఊబిలో ముంచేశారు. సరైన రాజకీయ ప్రత్యామ్నా యంగా  వైఎస్ జగన్మోహనరెడ్డిని నమ్ముతున్నారణటానికి ఆయన బహిరంగ ఎన్నికల సభలకు వస్తున్న ఇసుకేస్తే రాలనంత జనం  అనవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై "కుల ముద్ర పడిన తీరు" ఇప్పుడు అర్థం అయి ఉంటుంది. అది కూడా నారా చంద్రబాబు నాయుడు మనసు లోని మాటల ద్వారానే బయట పడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: