ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో నిన్నటి వరకు నామినేషన్లు ప్రధాన పార్టీల రాజకీయ నేతలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా పోటీలో పాల్గొన్న అభ్యర్థుల నామినేషన్లను సేకరించిన రాష్ట్ర ఎన్నికల సంఘం అందులో ఉన్న లోటుపాట్లను మరియు తప్పులను లేవనెత్తుతూ కొంతమంది నేతలకు చివరి క్షణంలో టెన్షన్ పెడుతోంది.


ఈ నేపథ్యంలో పీలేరు నియోజకవర్గానికి చెందిన వైసిపి పార్టీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి నామినేషన్ పెండింగ్‌లో పడింది. నామినేషన్‌తో పాటు నో డ్యూస్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. దీంతో అధికారులు ఆయన నామినేషన్‌ను పెండింగ్‌లో పెట్టారు.


రామచంద్రారెడ్డి మొత్తం నాలుగు సెట్లు నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం అధికారులు స్క్రూటిని నిర్వహించారు. ఇందులో రామచంద్రారెడ్డి తన నామినేషన్‌తోపాటు నో డ్యూస్ సర్టిఫికేట్ లేకపోవడంతో ఈ విషయమై పై అధికారులతో సంప్రదిస్తున్నారు. దీంతో ఈ విషయం బయటకు రావడంతో పీలేరు వైసీపీ పార్టీ నియోజకవర్గ క్యాడర్ తో పాటు వైసీపీ పార్టీ అధిష్టానం లో ఆందోళన నెలకొంది.



మరింత సమాచారం తెలుసుకోండి: