స్వాతంత్య్ర పోరాట వీరుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన గడ్డగా భీమిలి నియోజకర్గానికి ప్రత్యేకత ఉంది.  అలాగే విశాఖ జిల్లాలోనూ కీలకంగా ఉన్న ఈ సెగ్మెంట్లో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకే టికెట్ అనుకున్న సమయంలో చివరి నిమిషంలో ఆయన ఓడిపోతానని తెలుసుకొని విశాఖ ఉత్తరం నియోజకవర్గానికి మారాడు. దీంతో  ఇటీవలే టీడీపీలో చేరిన  అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరికి భీమిలీ అసెంబ్లీ సీటును టీడీపీ కేటాయించింది.

ఇక గంటాతో విభేధించి టీడీపీ నుంచి వైసీపీలో చేరిన అవంతి శ్రీనివాసరావు బరిలో ఉన్నారు. నియోజకవర్గానికి ఇద్దరు కొత్త అభ్యర్థులే కావడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఇక వీరితోపాటు జనసేన నుంచి భీమిలీలో పంచకర్ల సందీప్ ఎన్ని ఓట్లు చీల్చుతాడనే దానిపైనే అందరి దృష్టి నెలకొంది. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు  12సార్లు ఎన్నికలు జరిగాయి. మొదట స్వతంత్య్ర అభ్యర్థులు - ఆ తరువాత కాంగ్రెస్ నాయకులు విజయం సాధిస్తూ వచ్చారు. 1983లో టీడీపీ ఆవిర్భావం తరువాత పోషపాటి ఆనందగజపతిరాజు విజయం సాధించారు. వరుసగా నాలుగుసార్లు పసుపు జెండా ఎగిరినా రెండుసార్లు టీడీపీ ఓడిపోయింది.

2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు గెలుపొందారు. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండడతో పాటు యాదవ్ - మత్స్యకారులు ఇక్కడ గెలుపొటములను నిర్ణయిస్తారు.మంత్రి గంటా శ్రీనివాస్ ప్రధాన అనుచరుడు - విద్యాసంస్థల అధిపతి అయిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాన్ అవంతి శ్రీనివాస్ గంటా అండదండలతో 2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. ఈ ఎన్నికల్లో 42వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

తొలిసారి ఎంపీ అయిన అవంతి నియోజకవర్గ సమస్యలతో పాటు విభజన సమస్యలను లోక్ సభలో ప్రస్తావించారు.కొత్త అభ్యర్థిని పార్టీ అధినేత బాబు ఇక్కడ దించాడు. దీనిని ప్రచారం చేస్తూ ఆవంతి శ్రీనివాస్ దూసుకెళ్తున్నారు. నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో వైసీపీ గాలి వీస్తుండడంతో ఆవంతికే ఎక్కువ అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రత్యర్థి సబ్బం హరి చివరి నిమిషంలో టికెట్ చేజిక్కించుకోవడం టీడీపీ కేడర్ ఆయనకు సహకరించే పరిస్థితి లేదట, బయట నుంచి సబ్బం హరిని తీసుకెళ్లడంతో టీడీపీ కేడర్ ఆయన్ను వ్యతిరేకిస్తోంది. 20 రోజులు కూడా లేని ఎన్నికల సమయంలో సబ్బం హరి ఏమేరకే పోటీనిస్తాడన్నది అనుమానంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: