విశాఖపట్నం జిల్లాలోనే అత్యంత ప్రాధాన్యం కలిగిన అసెంబ్లీ నియోకవర్గాల జాబితాలో గాజువాక రెండోదిగా ఉంది. సింగిల్ మండలంతోనే ఏర్పడిపోయిన గాజువాకలో ఇప్పటిదాకా రెండు దఫాలుగా ఎన్నికలు జరిగితే. ఫస్ట్ టైం మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం తరఫున పోటీ చేసిన చింతలపూడి వెంకట్రామయ్య జయకేతనం ఎగురవేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో (2014) ప్రజారాజ్యం అడ్రెస్ లేకుండా పోగా వైసీపీ కొత్తగా బరిలోకి దిగింది.

అయితే వైసీపీ అభ్యర్థిని ఓడించిన టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు విజయం సాధించారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పల్లా మరోమారు టీడీపీ టికెట్ ను దక్కించుకోగా, వైసీపీ అభ్యర్థిగా మరోమారు తిప్పల నాగిరెడ్డి టికెట్ సాధించారు. ఇక ఇక్కడ తొలి విజయం ప్రజారాజ్యానిది కాగా ఇప్పుడు ఈ సీటులో జెండా ఎగురవేసేందుకు జనసేన అధినేత పవన్పవన్ బరిలోకి దిగడంతో ఇప్పుడు సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచిందని చెప్పాలి కల్యాణ్ ఏకంగా స్వయంగానే రంగంలోకి దిగిపోయారు. ఇప్పటికే రెండు సార్లు బరిలోకి దిగి ముచ్చటగా మూడో పర్యాయం కూడా ఇక్కడి నుంచే పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి. అటు పవన్ తో పాటు ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు చెమటలు పట్టించడం ఖాయంగానే కనిపిస్తోంది.

ఇప్పటి పరిస్థితిని కాస్తంత పోల్చి చూస్తే  జనసేన - బీజేపీల ఓటింగ్ చీలడంతో పల్లా శ్రీనివాసరావు దెబ్బ పడే ప్రమాదం లేకపోలేదు. అదే సమయంలో టీడీపీ - బీజేపీ ఓటింగ్ లేకుండా పవన్ కల్యాణ్ సొంతంగా ఏ మేరకు రాణిస్తారన్నది ఇప్పుడు అతి పెద్ద ప్రశ్నగా మారింది. అయితే కొత్తగా నమోదైన ఓట్లన్నీ తనకే పడతాయని - దానికి తోడు ఇప్పటికే నియోజకవర్గంలో ఉన్న తన సామాజిక వర్గం ఓట్లు తోడైతే తన గెలుపునకు ఢోకా లేదన్న ధీమాతో పవన్ ఉన్నట్లుగా తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: