ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సీరియస్ గా రాజకీయాలు జరుగుతున్న సమయంలో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కే ఏ పాల్ చేస్తున్న కామెంట్లు అందరికీ కామెడీని తలపిస్తున్నాయి. ఇటీవల ఆంధ్రరాష్ట్రంలో ఉన్న ప్రజాశాంతి పార్టీ కి సంబంధించిన నాయకులు 70 మంది నామినేషన్లు వేసిన నేపథ్యంలో వాటిలో పది మంది అనర్హులుగా చేరడంతో..ఆంధ్ర రాష్ట్రంలో జరగబోయే 2019 ఎన్నికలను ఆపడానికి ముమ్మర ఏర్పాట్లు చేసుకుని ఢిల్లీ బయలుదేరారు కే ఏ పాల్.


ఈ సందర్భంగా సోషల్ మీడియా లో ఉన్న ప్రజాశాంతి పార్టీ కార్యకర్తలు మరియు నాయకులను ఎలర్ట్ చేసి ఢిల్లీలో కోడలితో మంతనాలు జరిపారు పాల్. అర్ధరాత్రి ఎన్నికల కమిషన్ నీ కలిసి ఆంధ్ర రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలను ఆపేయాలని అలాగే నామినేషన్లు తిరస్కరణ విషయంలో కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలిపారు.


ఈ క్రమంలో విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్న కేఏ పాల్ తో ఆ ప్రాంతంలో ఉన్న ప్రయాణికులు సెల్ఫీ లు దిగడానికి ఎగబడ్డారు. ఎవరైతే ప్రజాశాంతి పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నామినేషన్లు వేశారో వారందరూ చాలా ఎలర్ట్ గా ఈ రోజు రాత్రి ఉండాలని సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసి సంచలనం సృష్టిస్తున్నారు కేఏ పాల్. మొత్తం మీద కే ఏ పాల్ ఢిల్లీకి పయనం అవటంతో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ ఆంధ్ర రాజకీయ నేతల్లో నెలకొంది.



మరింత సమాచారం తెలుసుకోండి: