దెందులూరు సీటు పై ఏపీవ్యాప్తంగా ఇపుడు చర్చ సాగుతోంది. అక్కడ ఉన్నది ఎవరో కాదు, టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర చౌదరి. ఆయన పేరు ఓ విధంగా ఏపీవ్యాప్తంగా పాపులర్. ఎమ్మార్వో వనజాక్షి కేసులో చింతమనేని చేసిన యాక్షన్ అంతా ఇంతా కాదు. దాంతో ఆయన పేరు మారుమోగిపోయింది. ఇక వివాదాలకు పెట్టింది పేరు ఈ ఎమ్మెల్యే. ఇప్పటికి రెండుసార్లు గెలిచిన దెందులూరు ఎమ్మెల్యే హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్ళూరుతున్నారు. 


అయితే ఈ రోజు చింతలపూడిలో జగన్ సభలకు వచ్చిన జనం చూస్తే చాలు ప్రభాకర్ గెలుపు మీద ఆశలు వదిలేసుకోవచ్చుననిపిస్తోంది. ఇసుక వేస్తే రాలనంతా జనం చింతలపూడికి వచ్చారు. మేడా, మిద్దే అన్న తేడా లేకుండా  రోడ్లన్నీ  కిటకిటలాడారు. చూస్తే మాడ్చేసే మార్చి ఎండలు. మరో వైపు వేడి గాలులు అయినా సరే జనమే జనంగా జగన్ సభ సాగింది. ఈ సభలో జగన్ చెప్పిన ప్రతి మాటకు వచ్చిన రెస్పాన్స్ చూస్తే చింతమనేని హ్యాట్రిక్ ఆశలు వదులుకోవాల్సిందేననిపిస్తుంది. 


జగన్ పట్ల నమ్మకం, ఆదరణ ప్రస్పుటంగా కనిపించిన ఈ సభను చూసిన తరువాత టీడీపీ సైతం పదేళ్ల జమానాకు ముగింపు అనుకోవాల్సిందే. నాడు వైఎసార్ పాదయాత్ర తరువాత దెందులూరులో ఇక్కడ కాంగ్రెస్ జెండా పాతింది. ఇపుడు జగన్ పాదయాత్ర తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ జెండా పాతడం ష్యూర్ అంటున్నారు. మొత్తానికి జగన్ మీటింగ్ ప్రత్యర్ధుల గుండెలదిరేలా సాగింది. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి బీపీ తెప్పించేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: