వైసిపి పార్టీ అధినేత జగన్ ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ ఆ సమయంలో తాను మద్దతు తెలిపిన చంద్రబాబు అవినీతి చేస్తే కచ్చితంగా ప్రశ్నిస్తామని ప్రజలకు ఆ సమయంలో వాగ్దానం చేసిన పవన్ కళ్యాణ్ గత ఐదు సంవత్సరాల నుండి చంద్రబాబు చేస్తున్న అవినీతిని ఏనాడైనా ప్రశ్నించార అంటూ...చంద్రబాబు పార్ట్నర్ అంటూ ప్రజలకు అర్థమయ్యే రీతిలో సంచలన వ్యాఖ్యలు చేశారు.


అంతేకాకుండా చంద్రబాబు రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి చేయని నేపథ్యంలో..ఎన్నికలు వస్తున్న తరుణంలో తన బాబాయిని చంపించి...వాటి చుట్టే రాజకీయాలు ఉండేలా ఎన్నికల లోకి వచ్చే దమ్ము లేక తన బాబాయ్ ని చంద్రబాబు హత్య చేయిస్తే..చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ ని చేతిలో పెట్టుకుని తన పార్టనర్ విజ్ఞత లేకుండా వ్యవహరిస్తున్నారంటూ...పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు జగన్.


ఇలానే చంద్రబాబు పార్ట్నర్ యాక్టర్ పవన్ కళ్యాణ్ ఇంట్లో ఇటువంటి సంఘటన జరిగితే చంద్రబాబు మనుషులు వచ్చి పార్ట్నర్ ఇంటిలో పెద్ద మనిషి ని చంపేస్తే తరువాత చంద్రబాబు ప్రభుత్వమే విచారణ చేస్తుంటే మీరు నమ్ముతారా యాక్టర్ పార్టనర్ అంటూ పవన్ కళ్యాణ్ పై ప్రశ్నల వర్షం కురిపించారు జగన్. ఇంత దారుణంగా రాజకీయాలు చేసుకుంటే చంద్రబాబు పార్ట్నర్ యాక్టర్ పవన్ కళ్యాణ్ ప్రజలని మోసం చేస్తూ రాష్ట్రాన్ని అవినీతి మయం చేసిన చంద్రబాబు ని ప్రశ్నించకుండా...చంద్రబాబు పార్ట్నర్ తన ఎన్నికల ప్రచారంలో జగన్ జగన్ జగన్ అంటూ నా జపం చేస్తున్నారని చంద్రబాబు పార్ట్నర్ యాక్టర్ పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు జగన్.



మరింత సమాచారం తెలుసుకోండి: