ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇంటెలిజెన్స్‌ ఐజీ ఏబీ వెంకటేశ్వర రావును ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. కడప ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నంలను కూడా ఎలక్షన్ డ్యూటీ నుంచి తప్పించి బదిలీ చేసింది. ఈ ముగ్గుర్ని పోలీస్‌ హెడ్‌ క్వార్టర్‌కు అటాచ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వీరికి ఎన్నికల పనులను అప్పగించొద్దని ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎబి వెంకటేశ్వరరావు స్థానంలో సీనియర్ అధికారికి ఆ బాధ్యతలు అప్పగించాలని సూచించింది.


పోలీస్‌ వ్యవస్థలో కీలక అధికారులుగా ఉన్న వీరు ఈ సార్వత్రిక ఎన్నికల్లో తమ విధులను సక్రమంగా నిర్వర్తించకుండా తెలుగుదేశం కార్యకర్తల్లా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా పనిచేస్తుండటంతో ఈసీ కఠిన నిర్ణయం తీసుకుంది. ఏబీ వెంకటేశ్వర రావు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని, పలు దఫాలుగా వైఎస్సార్‌సీపీ, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెల్సిందే. దీనిపై విచారణ చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం వెంకటేశ్వరరావుతో పాటు ఇద్దరు ఎస్పీలను ఎన్నికల విధుల నుంచి తప్పించింది.


ఎంత వివాదం వచ్చినా, ఇంటెలిజెన్స్ అధిపతి ఎబి వెంకటేశ్వరరావును వదలుకోవడానికి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్దపడడం లేదు. ఆఖరికి ప్రభుత్వ పరువు ప్రతిష్ట పోతున్నా రాజ్యాంగ సంస్థ ఎన్నికల సంఘం ఆదేశాలను కూడా దిక్కరిస్తూ ఆయన ఏబి వెంకటేశ్వరరావును అదే పదవిలో కొనసాగించాలని నిర్ణయించుకున్నారని సమాచారం.

ap intelligence chief ab venkateswara rao కోసం చిత్ర ఫలితం

రాష్ట్రం ప్రజల సొత్తు. ఏబి వెనటేశ్వర రావు లాంటి వాళ్ళు జీతం తీసుకునే ఉద్యోగులు. ముఖ్యమంత్రి ఎన్నికల ద్వారా ఎంపికైన ప్రజా ప్రతినిధులు. వీరంతా రాష్ట్ర ప్రతిష్ట కన్నా గొప్పవారు కాదు!


అయితే మొదట జీవోలో ఎన్నికల సంఘం ఆదేశించిన మేరకు ఏబి వెంకటేశ్వరరావుతో పాటు ఇద్దరు జిల్లాల ఎస్పిలను బదిలీ చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చి, ఆ తర్వాత మనసు మార్చుకుని వెంకటేశ్వరరావు ఎన్నికల సంఘం పరిధి లోకి రారంటూ కొత్త వాదన తీసుకు వచ్చి కొత్త జిఓ ఇచ్చారు. అసలు వెంకటేశ్వర రావు పోలీసు వ్యవస్థ కోసం కాకుండా తెలుగు దేశం పార్టీకి పనిచేస్తున్నారని వైసిపి గత కొన్నినెలలుగా తలబాదుకుంటూ ఎన్నికల సంఘానికి పిర్యాదులు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఏబి వెంకటేశ్వరరావు ఆ పదవిలో లేకపోతే ముఖ్యమంత్రికి కాకుండా వ్యక్తి గతంగా నారా చంద్రబాబు నాయుడుకి కష్టం అవుతుందేమో?

ap intelligence chief ab venkateswara rao కోసం చిత్ర ఫలితం

నారా చంద్రబాబు నాయుడు వ్యక్తిగత బలహీనతలేమైనా ఈ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వర రావు పిడికిట్లో ఉన్నాయేమో? అసలే ఇంటెలిజెన్స్ చీఫ్ కదా! ఏదో సమాచారం పట్టేసి ఉండబట్టే ఈ పరిస్థితి రాష్ట్రానికి తగులు కుందని అమరావతి జనం అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: