అపర చాణక్యుడిగా పేరున్న చంద్రబాబు రాజకీయాస్త్రంగా జగన్ మీదకి వదిలిన బాణం గా పవన్ కళ్యాణ్ ను ప్రజలు చాలా రోజులు పరిగణించారు. అయితే పవన్ మాత్రం త్వరగానే తేరుకొని తనదైన శైలిలో తన ప్రత్యేకతను నిలుపుకున్నాడు. అప్పుడు తన పక్కన ఉన్న వాడే ఇప్పుడు పక్కలో బల్లెం లా తయారయ్యాడు.

మొన్న గూండా రాజకీయాలు చేస్తున్నారని చింతమనేని ప్రభాకర్ ని విమర్శించిన పవన్ మాటలకు సమాధానం ఇవ్వకుండా చంద్ర బాబు మళ్లీ అతనికే టికెట్టు కన్ఫర్మ్ చేశాడు. అలాగే ఎంతో మంది మీద అవినీతి ఆరోపణలను పవన్ ప్రశ్నిస్తే దానిని చంద్రబాబు తెలివిగా తప్పించుకున్నారు. అలాగే పవన్ ఆరోపించిన ఎమ్మెల్యే లకే మళ్లీ టికెట్లు కట్టబెట్టారు.

అసలు చంద్రబాబుకి పవన్ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేదు అని ప్రజానీకం మాట్లాడుకుంటున్నారు. ప్రతీసారి ఆయన పవన్ కి అనుభవం లేదు అని తప్పించుకుని వెళ్తున్నాడే తప్ప ఎలాంటి వివరణ ఇవ్వట్లేదు. దీనిని బట్టే చంద్రబాబు కి కేవలం అధికార దాహం తప్ప తన అభ్యర్థుల పనితీరుపై ఎలాంటి అవగాహన లేదని అర్థం అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: