లోపాలు లేని మనిషంటూ ఉండడు.. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది. అందుకే స్వీయలోపంబెరుగుట పెద్ద విద్య అంటాడు మహా కవి గాలిబ్. మనలోని లోపాన్ని తెలుసుకుని సరిదిద్దుకోవడం విజ్ఞుల లక్షణం.


కానీ అలాంటి ఉద్దేశ్యం ఏపీ సీఎం చంద్రబాబు పుత్రరత్నం లోకేశ్‌కు ఏమాత్రం ఉన్నట్టు లేదు. మైకు చేతిలో ఉంటే.. ఆయనకు ఏదో ఒక తప్పు దొర్లుతూనే ఉంటుంది. ఆ తప్పులు సోషల్ మీడియాలో వైరల్ కావడం కామన్ అయ్యింది. 

తొలిసారి ప్రజాక్షేత్రంలో పోటీకి దిగుతున్న సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన లోకేశ్ రోజుకో తప్పు మాట్లాడుతూ ప్రజలకు వినోదం పంచుతున్నారు. ఇటీవలే ఆయన ఎన్నికల తేదీలు తప్పు చెప్పారు. తాజాగా ఆయన విశాఖ ఎయిర్‌ పోర్టును వైకాపా ఎయిర్ పోర్ట్ అంటూ తడబడ్డారు. 

మొన్నటికి మొన్న డెంగ్యూ వ్యాధిపై పోరాటం గురించి ఆయన మాట్లాడబోయి.. ఏకంగా ఓ పచ్చిబూతును అలవోకగా మాట్లాడేశారు చిన్నబాబు. అందుకే లోకేశ్ మైక్ పట్టుకున్నాడంటే చాలు తెలుగుదేశం శ్రేణులు గడగడా వణుకు తున్నాయట. ఎక్కడ ఏ తప్పుదొర్లుతుందోనని హడలెత్తిపోతున్నారట. మరి ఈ లోపంపై లోకేశ్ కసరత్తు చేయడం లేదా.. చేసే ఉద్దేశం లేదా..? 



మరింత సమాచారం తెలుసుకోండి: