ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ముక్కోణపోటీ జరుగుతోంది. తెలుగుదేశం, వైసీపీ, జనసేన తలపడుతున్నాయి. కానీ విచిత్రంగా విపక్షాలైన వైసీపీ, జనసేన మధ్య మాటల యుద్ధాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవలి కాలంలో ఈ పార్టీల అధినేతలు తీసుకున్న నిర్ణయాలపై చర్చ జరుగుతోంది. 


జగన్‌ కొన్ని విషయాల్లో సెల్ఫ్‌గోల్ వేసుకున్నాడని.. పవన్ పార్టీ వాళ్లు.. పవన్ సెల్ఫ్గ్ గోల్ చేసుకున్నాడని జగన్ పార్టీ వాళ్లు చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆ సెల్ఫ్‌ గోల్స్ ఏంటో ఓసారి పరిశీలిద్దాం.. జగన్ విషయానికి వస్తే.. టీఆర్‌ఎస్‌ నేతలతో భేటీలు కావడం.. కేసీఆర్ సాయం తీసకుంటే తప్పేంటి అనడం జగన్‌కు ఇబ్బందికరంగా మారతాయని ఇది సెల్ఫ్‌గోల్‌ అని ఓ వాదన. 

వివేకానందరెడ్డి హత్య విషయంలో ప్రభుత్వం పాత్ర ఉందని జగన్ నేరుగా విమర్శించడం కూడా సెల్ఫ్‌గోల్ అయ్యిందని కొందరు అంటున్నారు. అలా జగన్ అన్న తర్వాతనే టీడీపీ దాన్ని జనంలోకి బాగా తీసుకెళ్తోందని.. జగన్‌ కుటుంబమే వివేకాను చంపిందని.. జగన్ సొంత చిన్నాన్న విషయంలోనే దారుణంగా ప్రవర్తిస్తున్నాడని టీడీపీ ప్రచారం చేసింది. 

ఇక పవన్ కల్యాణ్ విషయానికి వస్తే.. ఆయన ఇటీవల వైసీపీ అధినేతలు, వైసీపీని తన ఎన్నికల ప్రచారంలో తీవ్రంగా విమర్శిస్తున్నాడు. విపక్షంలో ఉన్న నేత.. ముందుగా ప్రభుత్వాధినేతలను విమర్శించడం మాని ప్రతిపక్షనేతపై విరుచుకుపడటం ఏంటన్న అనుమానం జనంలో కలిగేలా పవన్ ప్రవర్తించడం ఓ సెల్ఫ్‌గోల్‌ గా వర్ణిస్తున్నారు. 
అలాగే ఆంధ్రాలో సెంటిమెంట్ రెచ్చగొట్టడం కోసం హైదరాబాద్ లో ఆంధ్రావాళ్లను కొడుతున్నారని.. కేసీఆర్ రోజూ ఆంధ్రులను తిడుతున్నారని.. విమర్శలు చేయడం కూడా పవన్ సెల్ఫ్‌గోలే అంటున్నారు విశ్లేషకులు. పవన్ విమర్శలకు కౌంటర్‌ గా పోసాని కృష్ణ మురళి వంటి నేతలు పవన్ తీరుపై దుమ్మెత్తిపోశారు. మరి వీటిలో ఏవి సెల్ఫ్ గోల్స్ అవుతాయో ఎన్నికల ఫలితాలు వస్తే కానీ తెలియదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: