నేరాన్ని నేరంగా చూడాలి.. నేరాలను రాజకీయాలకు వాడుకుంటే.. నిజాలు సమాధి అవుతాయి. తాజాగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ చూస్తే ఇదే విషయం గుర్తుకువస్తుంది. హత్య జరిగి ఇప్పటికి పక్షం రోజులు దాటుతున్నా.. ఇంతవరకూ హత్య చేసిన వ్యక్తిని కనిపెట్టలేకపోయింది ఏపీ పోలీసు వ్యవస్థ. 


కానీ ఇంతలోనే.. ఈ హత్య కేసులో సాక్ష్యాలు తారు మారు చేశారని ఆరోపిస్తూ కొందరిని అరెస్టు చేయడం చూస్తే ఈ కేసు విచారణ రాజకీయ కక్షల కోణంలో సాగుతుందని అనిపించకమానదు. వివేకానందరెడ్డి పీఎ కృష్ణారెడ్డి, బంధువు గంగిరెడ్డి, మరో వ్యక్తి ప్రకాశ్‌లను అరెస్టు చేశారు. 

వీరు చేసిన తప్పులు ఏంటంటే.. పడకగదిలో ఉన్న శవాన్ని బాత్ రూమ్‌లోకి మార్చడం.. సాక్ష్యాలు తారుమారు చేసేందుకు ప్రయత్నించడం.  వివేకా రాసినట్టు చెబుతున్న లేఖను దాచడం. వాస్తవానికి వీరు నిజంగా ఆ పని చేస్తే అరెస్టు చేయవచ్చు తప్పులేదు.  కానీ సాధారణగా అసలు హంతకుడిని
పట్టుకున్న తర్వాత.. ఇదిగో ఈ హంతకుడికి సహాయంగా వీరు ఈ పనులు చేశారు.. కేసును తప్పుదోవ పట్టించారు అని ఇలాంటి వారిని అరెస్టు చేస్తారు. 

ఇక్కడ సీన్ రివర్స్ లో ఉంది. ఎలాగైనా సరే అరెస్టు చేసేయాలి. జగన్ కుటుంబమే దీని వెనుక ఉందని ప్రజలకు అనిపించాలి. వచ్చే ఎన్నికల్లో ఇలాంటి నేర కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మీకు సీఎం ఎలా అవుతాడన్న చర్చ జరిగేలా చూడాలన్నది టీడీపీ సర్కారు ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: