రావాలి జగన్‌.. కావాలి జగన్‌.. ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే.. గీతం వినిపిస్తోంది. వైసీపీ ఎన్నికల ప్రచార గీతం సోషల్ మీడయాలో వైరల్ గా మారుతోంది. సినిమా ట్రైలర్లను మించిన రీతిలో ప్రజల మనసులను చూరగొంటోంది. టాప్ హీరోల సినిమా ఆడియోలను తలపిస్తూ వ్యూస్‌ విషయంలో దూసుకుపోతోంది. 


ఇంటర్‌నెట్‌లో ఆ పాటను చూసిన వారి సంఖ్య ఇప్పటివరకు 77 లక్షలు దాటింది. దేశ రాజకీయ చరిత్రలో ఒక పార్టీ ప్రచారగీతం ఈ స్థాయిలో ఆకర్షించడం ఆల్‌టైం రికార్డుగా చెబుతున్నారు.  రోజులు గడిచే కొద్దీ ఇంటర్‌నెట్‌లో చూసేవారి సంఖ్య లక్షల్లో పెరుగుతోందంటే ఈ పాట ప్రజల్లో ఎంత ఆదరణ పొందిందో అర్దం అవుతోందని చెబుతున్నారు. 

అందరి హృదయాలు గెలుచుకుంటున్న ఈ పాటను సినీ రచయిత సుద్దాల అశోక్‌ తేజ రచించగా.. శక్తికాంత్ కార్తిక్ సంగీతం అందించారు. ఈయన గతంలో ఫిదా వంటి హిట్ చిత్రాలను మ్యూజిక్ అందించారు. ఇక పాట పాడింది ప్రఖ్యాత గాయకుడు మనో. ఓ ప్రాంతీయ పార్టీకి చెందిన రావాలి జగన్ కావాలి జగన్ పాట.. ఫస్ట్ ప్లేస్ లో ఉంటే.. జాతీయ పార్టీల గీతాలు తదుపరి స్థానాల్లో ఉండటం విశేషం. 

ఇక ఈ పార్టీ గీతాన్ని వైసీపీ శ్రేణులు తమ ప్రచారంలో హోరెత్తిస్తున్నాయి. ఇక వైసీపీ కార్యకర్తలు, నాయకులు తమ సోషల్ మీడియా ప్లాట్ ఫాముల్లో దీన్ని జోరుగా షేర్ చేస్తున్నారు. వాట్సప్ గ్రూపుల్లోనూ స్టేటస్‌ ల్లోనూ పెడుతూ ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: