ప్రతి  ఎన్నికల్లో ఓ అంశం ఉంటుంది. అది అప్పటి పరిస్థితులను బట్టి రాజకీయ పార్టీలు ఎంచుకుని ముందుకు పోతాయి. కొన్ని సార్లు జనం మూడ్ ఇదీ అని వేసిన అంచనాలు తప్పుతాయి. అపుడు మొత్తం సీన్ రివర్స్ అవుతుంది. ఏపీ విషయానికి వస్తే జనం మూడ్ ఎలా ఉంది. నినాదాలు ఏమంటున్నాయి.


ఏపీలో చంద్రబాబు గత ఏడాదిగా మోడీని తిట్టిన తిట్టు తిట్టకుండా పొద్దు గడపడంలేదు. కొన్ని నెలలుగా కేసీయార్ ని కూడా తగిలించి తిడుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఎన్నికల సీజన్లో ఇపుడు తెలంగాణా, ఆంధ్ర అంటూ విద్వేషాలు నింపే ప్రసంగాలు చేస్తున్నారు. ఆంధ్రులను నాడు  అలా తిట్టారు ఇలా తిట్టారు అంటూ బాబు చెబుతున్న కబుర్లు ఎలా ఉన్నా జనంలో మాత్రం ఆ సెంటిమెంట్ ఏపీలో లేదని అందరికీ అర్ధమవుతోంది. అయిదేళ్ళ క్రితం నాటి విషయాలను పట్టించుకుని పొరుగు రాష్ట్రంలో గొడవలు పడడానికి ఏపీ జనాలు సిధ్ధంగా లేరని తెలుస్తోంది. కానీ బాబు మాత్రం ఈ సెంటిమెంట్ పండించాలనుకుంటున్నారు.


అయితే ఎంత ఎక్కువగా దాన్ని చెబితే అది టీడీపీకే బూమరాంగ్ అవుతుందని పొలిటికల్ పండిట్స్ అంటున్నారు. ఏపీ ప్రజలు  ముఖ్యంగా ఇపుడు డెవ‌లప్మెంట్ గురించి ఆలోచన చేస్తున్నారని, అంతే తప్ప తెలంగాణాతో గొడవలు, కేంద్రంలో గొడవలు పెట్టుకోమని ఎవరూ కోరడం లేదని కూడా అంటున్నారు. అయిదేళ్ళ క్రితం బాబుని అధికారంలో కూర్చోబెట్టింది ఆయన అనుభవం చూసి, కేంద్రంతో సఖ్యతగా ఉంటారని చూసి తప్ప మరేమీ కాదని కూడా అంటున్నారు. అయితే బాబు అభివ్రుధ్ధిని పక్కన పెట్టి రాజకీయాలు చేయడాన్ని ఏపీ జనం తట్టుకోరని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: