పవన్ కళ్యాణ్ అర్ధం పర్ధం లేని ఆరోపణలతో ప్రజల్లో నవ్వులపాలవుతున్నాడు. తన సభల్లో కేవలం జగన్ ను మాత్రమే విమర్శించడం , చంద్రబాబును వదిలేయడంతో పవన్ కు ఉన్న క్రెడిబిలిటీ కోల్పోయాడు. చంద్రబాబు, లోకేష్ పై మొన్నటివరకు ఓ రేంజ్ లో విరుచుకుపడిన జనసేనాని, ఇప్పుడు వాళ్లిద్దరి విషయంలో మౌనవ్రతం పాటిస్తున్నారు. పవన్ ఎందుకిలా సడెన్ గా సైలెంట్ అయిపోయారో, కేవలం జగన్ ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో ప్రజలు ఈజీగానే అర్థం చేసుకున్నారు.

గురువారం 3 బహిరంగ సభల్లో పాల్గొన్నారు పవన్. వీటిలో ఒక్కటంటే ఒక్క సభలో కూడా చంద్రబాబును పల్లెత్తుమాట అనలేదు. చివరికి ప్రభుత్వంపై చేయాల్సిన విమర్శలను కూడా జగన్ కు ఆపాదించి, కామెడీ పీస్ గా మారిపోయారు. రాయలసీమలో హెలికాప్టర్ ల్యాండింగ్ కు జగన్ అనుమతి ఇవ్వలేదట. కడపలో బహిరంగ సభ కోసం ఏర్పాటుచేసిన స్టేజీని జగన్ తొలిగించారట.

చివరికి తిరుపతిలో ప్రచారం చేద్దామంటే జగన్ వల్ల పోలీసులు సహకరించలేదట. పవన్ చేసిన ఈ ఆరోపణలకు జగన్ కు ఎక్కడైనా సంబంధం ఉందా? పవన్ పైన చేసిన ఆరోపణలన్నీ ప్రభుత్వానికి, చంద్రబాబుకు సంబంధించినవి. హెలికాప్టర్ ల్యాండింగ్ ను ప్రతిపక్షంలో ఉన్న జగన్ అడ్డుకోగలరా? తిరుపతిలో పవన్ ప్రచారానికి పోలీసులు సహకరించకపోతే దానికి జగన్ కారణమా? ఇలా అర్థంపర్థం లేని ఆరోపణలతో తన పరువు తానే తీసుకుంటున్నారు పవన్.

మరింత సమాచారం తెలుసుకోండి: