ఏపీ రాజకీయాలు ఇపుడు మంచి వేడి మీద ఉన్నాయి. అధికార టీడీపీ మరో మారు గెలవాలని అన్ని శక్తులు ఒడ్డుతోంది. మరో వైపు వైసెపీ ఈసారి తప్పకుండా అధికారం మాదేనని అంటోంది. ఇపుడు ఎలాగైనా రావాలసిందేనని కూడా చెబుతోంది. మరి ఈ రెండు పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి.


అయితే రాజకీయ విశ్లేషణలను   ఇప్పటి వరకూ ఉన్న అంచనాలు చూసినపుడు ఏపీలో వైసీపీకి ఎడ్జ్ ఉన్నట్లుగా అర్ధమవుతోంది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా జగన్ ధీటుగా బాబుతో పోరాడుతున్నారు. ప్రజలు కూడా జగన్ కి ఒక చాన్స్ ఇవ్వాలనుకుంటున్నారు. జగన్ వస్తే దారుణమే. అరాచకమే అని బాబు అండ్ కో ఎంత చెప్పినా కూడా ప్రజలలో   అదేంటో చూడాలన్న కుతూహలం పెరిగిపోతోంది. ఈ పరిణామామలే వైసీపీకి ప్లస్ గా మారుతున్నాయి. ఓ వైపు చంద్రబాబు జగన్ని తలవకుండా పొద్దు పుచ్చడం లేదు. ఆ విధంగా ఆయన తన సభల్లో జగన్ కే ఎక్కువ ప్రాధ్యాంత ఇచ్చేసి హైప్ బాగా పెంచేశారు.



నిజానికి చంద్రబాబు అనుభవశాలి అయితే తన గురించి. తన పాలన గురించి చెప్పుకునేవారు. ఎపుడైతే నెగిటివ్ పాలిటిక్స్ లో   తెరతీసారో అపుడే డొల్లతనం టీడీపీది బయటపడిపోయింది. ఈ పార్టీ ఇంతకంటే మరేమీ చేయదేమోనన్న ఆలోచనలు కూదా జనాల్లో కలిగేందుకు అవకాశం ఏర్పడింది. ఈ మొత్తం పరిణామాలు మెల్లగా జగన్ కి అనుకూలంగా మారుతున్నాయి. ఇంకో వైపు జగన్ ఒక్క చాన్స్ ఇవ్వండి అంటున్నారు. ఇస్తే తప్పేంటి అన్న ఆలొచన కూడా జనాల్లో మొదలవుతోంది.


ఇక జగన్ పాదయాత్ర సుదీర్ఘంగా చేయడం నిజంగా వైసీపీకి ఇపుడు పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఇలా పాదయాత్ర ముగియగానే అలా ఎన్నికలు రావడం కూడా ఆ పార్టీకి వరంగా ఉన్నాయి. మరో వైపు టీడీపీ ఎత్తులు, లోపాయికారి పొత్తులు, జిత్తులు, తగవులు,  విపరీతమైన కామెంట్స్ అతి చేయడాలు, డైలీ ఆ పార్టీ నాయకులు  ప్రెస్ మీట్లు పెట్టి మరీ జగన్నే టార్గెట్ గా అంతా కలసి తిట్టడాలు ఇవన్నీ జగన్ అవకాశాలు పెంచేయడానికి కారణాలుగా ఉన్నాయి. మరి ఇపుడైతే ప్రచారానికి కచ్చితంగా పది రోఅజులు మాత్రమే ఉంది. టీడీపీ కొత్త వ్యూహాలు ఏం చేస్తుందో కానీ. ఇప్పటికైతే జగన్ ని హీరోను అంతా కలసి చేసేశారు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: