దేశంలోనే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ తానేనని చంద్రబాబు నిత్యం చెప్పుకుంటారు. తనని మించిన వారు ఎవరూ లేరని ఆయన అంటారు. అటువంటిది చంద్రబాబుని ఎన్నికల్లో గెలిపించడానికి ఇతర రాష్ట్రాల నేతలు అవసరమా..ఇంతకీ బాబు రాజకీయం నిన్నా ఇవాళానా. 40 ఏళ్ళ అనుభవశాలి.  మరెందుకు ఆయన బయట నాయకులను తెస్తున్నారు.


అంటే ఏపీలో ఇపుడు టీడీపీకి  హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం అర్జంట్ గా వచ్చిపడింది. అందుకే ఇతర రాష్ట్రాల నుంచి నేతలను బాబు పిలుచుకుని వస్తున్నారని అంటున్నారు. 2014 ఎన్నికల్లో ఏపీలో బాబు డిల్లీలో మోడీ, ఈ ఇద్దరిదీ భలే జోడీ అంటూ చివరాఖర్లో ప్రచారం చేసి బాబుకు టీడీపీకి హైప్ క్రియేట్ చేశారు.  దాంతో వైసీపీ మీద పై చేయి సాధించి విజయం పొందారు. ఇపుడు చూస్తే పోటీలో  వైసీపీ ముందుంది టీడీపీ గ్రాఫ్ పెద్దగా పెరగడంలేదని అంటున్నారు దాంతో ఆ గ్రాఫ్ పెంచడానికి పొరుగు రాష్ట్రాల నేతలు వస్తున్నారని చెబుతున్నారు.


ఆప్ అధ్యక్షుడు, డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాలా  విజయవాడ వచ్చి బాబుకు అనుకూలంగా ప్రచారం చేయడం అందులో భాగమేనని అంటున్నారు. బాబు వంటి నేతనే ఎన్నుకోండని డిల్లీ సీఎం చెబుతున్నారు. జగన్ వేస్ట్ అని కూడా అంటున్నారు. నిన్న కాశ్మీర్ మాజీ సీఎం ఫారూక్ అబ్దుల్లా వచ్చి బాబు గ్రేట్ అన్నారు. రేపు విశాఖకు మమతా బెనర్జీ వచ్చి బాబునే ఎన్నుకోవాలి అని విశాఖ ప్రజలకు చెబుతారట. వాళ్లంతా చెబితే వోటర్లు వింటారా. 


అయినా బాబు గారికి మిగిలిన వారి సర్టిఫికేట్లు తెచ్చుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందో మరి. అయినా ప్రజలు ఏపీలో సాగిన బాబు గారి అయిదేళ్ల పాలనపైన తమ ఓటు వేస్తారు కానీ ఎవరో చెప్పారని వేయరు కదా. అప్పట్లో ఐతే బాబు మారిన మనిషిని అన్నారు. పదేళ్ళు అధికారానికి దూరంగా ఉన్నారన్న సానుభూతి ఉంది. మరో వైపు మోడీ క్రేజ్, పవన్ సినీ గ్లామర్, కుల సమీకరణలు అనీ పనిచేశాయి. ఇపుడు అలా ఉంటుందా. చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: