కృష్ణా జిల్లాలో దాదాపు అన్నీ నియోజకవర్గాల్లో టీడీపీ-వైసీపీల మధ్య హాట్ ఫైట్ నడుస్తుంది. ఇక కొన్ని స్థానాల్లో జనసేన కూడా ఈ రెండు పార్టీలకి గట్టి పోటీ ఇస్తుంది. ఇక జిల్లాలో రసవత్తరమైన పోరు జరిగే నియోజకవర్గాలో ముందు వరుసలో ఉండేది జగ్గయ్యపేట. ఇక్కడ టీడీపీ-వైసీపీల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ఈ క్రమంలోనే పాత ప్రత్యర్ధులు ముచ్చటగా మూడోసారి బరిలోకి దిగారు. టీడీపీ అభ్యర్థిగా శ్రీరాం రాజగోపాల్‌ (తాతయ్య) హ్యాట్రిక్‌ సాధించాలని తహతహలాడుతుండగా, ఎలాగైనా విజయం సాధించాలని వైసీపీ అభ్యర్థి సామినేని ఉదయభాను పట్టుదలతో ఉన్నారు.


ఇక టీడీపీ అయిదేళ్ల పాలనలో ఎమ్మెల్యే తాతయ్య…. ఎమ్మెల్సీ టీడీ జనార్దన్‌, మాజీ మంత్రి నెట్టెం రఘురామ్‌ సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. అయిదేళ్లలో రూ.2500 కోట్లతో అభివృద్ధి పనులు చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఎక్కువ శాతం పూర్తి చేసిన తాతయ్య విజయంపై ధీమాగా ఉన్నారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకి చేరువ్వడం, విజయవాడ పార్లమెంట్‌ అభ్యర్ధిగా కేశినేని నాని ఉండటం లాంటి అంశాలు తాతయ్యకి ప్లస్. అయితే ప్రభుత్వ పథకాల్లో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలు రావడం మైనస్.


గత రెండు ఎన్నికల్లో ఓటమి పాలవ్వతున్న సామినేని ఈసారి ఎలా అయిన గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ఓడిన సెంటిమెంట్..వైసీపీకి పెరిగిన బలం, ప్రభుత్వ పథకాల్లో అవినీతి లాంటి అంశాలు సామినేనికి కలిసొచ్చే అంశాలు. అయితే గతంలో సామినేని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడూ...నియోజవర్గంలో అవినీతి బాగా జరిగిందని..రౌడీయిజం ఎక్కువ ఉండేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో మళ్ళీ సామినేని గెలిస్తే పేటలో ప్రశాంతత పోతుందని భవన్ ప్రజల్లో ఉంటే సామినేనికి ఇబ్బందే అవుతుంది. ఇక జనసేన కూడా బరిలో ఉండటం సామినేనికి మైనస్ అయ్యేలా ఉంది. ఆ పార్టీ తరుపున ధరణికోట వెంకటరమణ పోటీలో ఉన్నారు.


అయితే ఇక్కడ జనసేనకి గెలిచే సత్తా లేదు కానీ....కాపు ఓట్లని చీల్చే అవకాశం ఉంది. సామినేని కూడా కాపు నేతే. తాతయ్య ఆర్యవైశ్య సామాజికవర్గ నేత. ఇక ఇక్కడ కమ్మ, ఆర్యవైశ్య, కాపు, ముస్లింలు, బీసీలు అధికంగా ఉన్నారు. కమ్మ, ఆర్యవైశ్యులు ఎక్కువ టీడీపీ వైపు ఉండగా..ముస్లింలు వైసీపీకి ఎక్కువ మద్ధతు ఇస్తారు. బీసీలు టీడీపీ-వైసీపీలకి సమానంగా ఉన్నారు. ఇక కాపులు మూడు పార్టీలకి మద్ధతు ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద టీడీపీ-వైసీపీలు పోటాపోటిగా తలపడుతున్నాయి. ఇద్దరికీ గెలిచే అవకాశాలు సమానంగానే ఉన్నట్లు కనపడుతుంది. కానీ జనసేన ఒక 10 వేల ఓట్లు చీల్చిన...విజయావకాశాలు తలకిందులు అయ్యే అవకాశం ఉంది. మరి చూడాలి జగ్గయ్యపేటలో ఈసారి గెలుపు ఎవరికి దక్కుతుందో..



మరింత సమాచారం తెలుసుకోండి: