కత్తి మహేశ్.. పవన్ కల్యాణ్ తో వివాదం ద్వారా పాపులర్ అయిన కత్తి మహేశ్ ఎన్నికల ద్వారా మరోసారి వార్తల్లోకి వస్తున్నారు. ఆయన కొన్ని ఛానళ్ల తరపున ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఆంధ్రా అంతా పర్యటిస్తూ రిపోర్టింగ్ చేస్తున్నారు. 


క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించిన ఆయన తన అంచనాలను ఓ టీవీ ఛానల్‌తో పంచుకున్నారు. తాను చూసినంతవరకూ సీట్లు ఎన్ని వస్తాయో చెప్పలేకపోయినా ట్రెండ్‌ ఎలా ఉంది.. ఎవరికి అడ్వాంటేజ్ ఉందన్న విషయాలు చెప్పగలనని కత్తి మహేశ్ అన్నారు. 

కత్తి మహేశ్ అంచనాల ప్రకారం.. ఇప్పటి వరకూ వైసీపీకి గ్రౌండ్‌ లెవల్లో అడ్వాంటేజ్‌ ఉందట. వైసీపీకి టీడీపీ కంటే మూడు నుంచి ఏడు శాతం వరకూ ముందంజలో ఉండొచ్చని కత్తి మహేశ్ అంచనా వేస్తున్నారు. ఈ శాతాలను సీట్ల రూపంలో మార్చి చెబితే.. వైసీపీకి ప్రస్తుతం ఉన్న పరిస్థితి బట్టి వంద నుంచి నూట పది స్థానాలు రావచ్చని కత్తి మహేశ్ అంచనా వేస్తున్నారు. 

కాబట్టి ఇప్పటి పరిస్థితిని బట్టి కాబోయే సీఎం జగనే అని కత్తి మహేశ్ తేల్చి చెప్పారు. చంద్రబాబు ఇటీవల ప్రవేశ పెట్టిన జనాకర్షక పథకాలు ఓట్లు రాలుస్తాయని తాను కూడా అంచనా వేశానని కానీ.. క్షేత్రస్థాయిలో తిరిగి చూస్తే పసుపు కుంకుమ చెక్కులను పాత బాకీల కింద బ్యాంకులు జమ చేసుకుంటున్నాయని అందువల్ల ఇవి ఓట్లు రాల్చేది తక్కువేనని కత్తి అభిప్రాయపడ్డారు.



మరింత సమాచారం తెలుసుకోండి: