ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి రోజులు దగ్గరపడ్డాయి అన్నట్టుగా ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని సర్వేలలో తెలుగుదేశం పార్టీ ఈసారి అధికారంలోకి రావడం కష్టమని ఫలితాలు వస్తున్న నేపథ్యంలో ఇంకా ఎన్నికలకు కొద్ది రోజులే గడువు ఉన్న క్రమంలో ప్రచారంలో పాల్గొంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు చుక్కలు చూపిస్తున్నారు ఏపీ ప్రజలు. గత సార్వత్రిక ఎన్నికలలో నోటికి ఇష్టం వచ్చినట్లు వాగ్దానాలు చేసిన టీడీపీ పెద్దలు ...వాటిని అధికారంలోకి వచ్చాక పక్కన పెట్టి తమ స్వార్ధ రాజకీయాలు చూసుకోవడంతో ఇప్పుడు ఏపీ ప్రజలు ఎన్నికల సమయంలో తమ దగ్గరికి వస్తున్న టీడీపీ నేతలకు ప్రశ్నలతో మరియు గత ఎన్నికలలో ఇచ్చిన హామీలను లేవనెత్తుతూ చెమటలు పట్టిస్తున్నారు.


ఈ నేపథ్యంలో టీడీపీ ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరీకి చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన పట్టణంలోని పాండురంగ వీధిలో పర్యటించారు. స్థానిక సమస్యలపైన మహిళలు ఆయన్ను గట్టిగా నిలదీశారు. ‘ఇంటి పట్టాలకోసం ఐదేళ్లలో పది సార్లు అర్జీలు ఇచ్చినాం.. ఇళ్లు లేని వాళ్లకు పట్టాలు ఇవ్వకుండా.. నీ వెనుక తిరిగే వాళ్లకు పట్టాలు ఇచ్చినావ్’ అంటూ ఆయన్ను నిలదీశారు.


దీంతో వారికి సమాధానం చెప్పకుండా  సూరి దాటేసుకుని వెళ్లిపోయారు. స్థానిక నాయకులు ‘మేమున్నాంలేమ్మా.. మళ్లీ అధికారంలోకొస్తే ఇప్పిస్తాం ’ అని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తే.. చూసినాం పోప్పా..’ అంటూ వారిని అక్కడి నుంచి తరిమేసినంత పనిచేశారు. ప్రస్తుతం ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: