ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ వేడి రాజుకుంటోంది. కృష్ణా జిల్లా పెనమలూరు రాజకీయాలు చూస్తే టీడీపీ తిరిగి ఇక్కడ ఖాతా సొంతం చేసుకునే అవకాశం ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈసారి పార్థసారథి లాంటి బలమైన నేత ఉండడంతో టఫ్ ఫైట్ కు దారితీస్తోందంటున్నారు. అధికార పార్టీ సంక్షేమ పథకాలతో ప్రజలకు రోజురోజుకి చేరువ అవుతోంది.  మరోవైపు టీడీపీ ఐదేళ్ల పాలనపై వ్యతిరేకతనే వైసీపీ నమ్ముకుంది. 2009 పునర్విభజనలో పెనమలూరు నియోజకవర్గంగా ఏర్పడింది. అప్పుడు వైఎస్ హయాంలో కీలకంగా ఉన్న కొలుసు పార్థసారథి కాంగ్రెస్ టికెట్ పై పోటీచేసి గెలుపొందారు.

2014లో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు కొలుసు పార్థసారథి. అప్పటి ఎన్నికల్లో పెనమలూరు నుంచి కాకుండా మచిలీపట్నం ఎంపీ టికెట్ పొంది పోటీకి దిగారు. అయితే బలమైన కొనకళ్ల నారాయణ చేతిలో ఓడిపోయారు. దీంతో కొలుసు పార్థసారథి 2019 ఎన్నికల్లో వైసీపీ తరుఫున తిరిగి పెనమలూరుకు మారారు. ఇక టీడీపీ తరుఫున 2014 ఎన్నికల్లో టికెట్ పొందిన బోడే ప్రసాద్ ఈజీగా గెలిచారు. అప్పుడు వైసీపీ పోటీ ఇవ్వలేకపోయింది. ఈ నాలుగేళ్లలో టీడీపీ ఎమ్మెల్యే ప్రసాద్ సాగునీరు చెరువుల అభివృద్ధి గ్రామాల్లో అభివృద్ధి రోడ్లు గాని ఇలా ప్రతి ఒక్కటి పూర్తి చేసి పెద్ద ఎత్తున ప్రజలకు చేరువయ్యాడు. 

ఈసారి బలమైన అభ్యర్థిగా బోడె ప్రసాద్ బరిలో ఉన్నారు. పార్థసారథి ఈయనను ఓడించడానికి ప్రయత్నిస్తున్నారు. పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బోడే ప్రసాద్ పనితీరుపై నియోజకవర్గంలో సంతృప్తి నెలకొంది. ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండే విషయంలో ఇతర నేతలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. విపక్ష వైసీపీ అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్న సీనియర్ పార్థసారథి ప్రభుత్వ వ్యతిరేకత, జగన్ మేనియానే నమ్ముకున్నారు. ఈయన దూకుడు వ్యవహారశైలి మైనస్ గా మారింది. ఇలా ప్రతి ఒక్కటిని బోడె ముందుండి పేదలకు అందిస్తూ నియోజకవర్గంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే పార్థసారథి ఎంత గట్టి పోటీనిచ్చినా మరోసారి బోడేకే విజయం ఖాయమని తేలింది.


మరింత సమాచారం తెలుసుకోండి: