చంద్రబాబు వ్యూహాలు పన్నాడంలో దిట్ట. ఇప్పటికీ దాదాపు ఆయన 7 ఎన్నికలలో పాల్గొన్న అనుభవం అతనిది . ఓటర్లను ఎలా మాయ చేయాలో, ఏం చేస్తే ఓట్లు పడతాయో బహుశా చంద్రబాబు గారికి తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో. ఇక పార్టీలకు అదనపు తలభారంగా మారే రెబల్స్ ను కంట్రోల్ చేయడం లో చంద్రబాబు అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శిస్తరు. అటు కర్ర విరుగక ఇటు పాము చావక అన్న రీతిలో రెబల్స్ ను కంట్రోల్ చేస్తారయన. గత 23 ఏళ్లుగా పార్టీలో రెబల్ అనే పదమే వినపడకుండా చేశారు చంద్రబాబు. కానీ తొలిసారిగా ఈసారి ఎన్నికల్లో ఎక్కువమంది టీడీపీ రెబల్స్ బరిలోగి దిగారు. దీంతో తన స్టైల్లో అందరినీ దారిలోకి తీసుకువచ్చారు చంద్రబాబు.

రెబల్స్ గనుక నామినేషన్ వెనుకకు తీసుకోకపోతే ఓట్లు చీలి టీడీపీ కి భారీ నష్టాన్ని తెచ్చిపెడుతుంది. తద్వారా టీడీపీ అభ్యర్థులు ఒడిపోవచ్చుకుడా. గురువారం నాటికి నామినేషన్ గడువు పూర్తవుతుంది. ఈలోపే చంద్రబాబు రెబల్స్ అందరితో మాట్లాడి సర్దిచెప్పారు. చాలా మంది ఆయన మాట విని పోటీ నుంచి తప్పుకున్నారు కూడా. మొత్తం 12 మంది రెబల్ అభ్యర్థులు వారి నామినేషన్ను వెన్నక్కి తీసుకున్నారు. వీరందరికీ పార్టీ అధికారం లోకి రాగానే ఎమ్మెల్సీ లేదా నియామక పదవులు ఇస్తామని నచ్చజెప్పారు.

ఇక నామినేషన్లను ఉపసంహరించుకున్న వారిని ఒకసారి గమనిస్తే, పుట్టపర్తిలో గంగన్న - మల్లెల జయరామ్ - విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కోడెల సూర్యలత - తాడికొండలో బెజ్జం సాయిప్రసాద్ - చీపురుపల్లి నియోజకవర్గంలో త్రిమూర్తుల రాజు - పలమనేరులో సుభాష్ చంద్రబోష్ - కళ్యాణదుర్గంలో హనుమంతరాయ చౌదరి - విశాఖ సౌత్ లో మహ్మద్ సాదిక్ - నెల్లూరు రూరల్ లో దేశాయశెట్టి హనుమంతరావు - గాజువాకలో లేళ్ల కోటేశ్వరరావు - మాచర్లలో చలమారెడ్డి - రాయదుర్గంలో దీపక్ రెడ్డి - రాజోలులో బత్తుల రాము ఉన్నారు. చంద్రబాబు హామీతో  రెబల్ అభ్యర్థులంతా పోటీ నుంచి తప్పుకుని టీడీపీ విజయానికి కృషి చేస్తామని చంద్రబాబుకి హామీ ఇచ్చారు. దీంతో.. పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: