ఏపి సర్కార్ కి మరో షాక్..ముగ్గురు ఐపీఎస్ అధికారుల బదిలీల విషయంలో  హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది.   ఇంటలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం, కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మలను మంగళవారం నాడు రాత్రి సీఈసీ బదిలీ చేసింది. ఈ బదిలీలను నిరసిస్తూ బుధవారం నాడు  ఏపీ ప్రభుత్వం బుధవారం నాడు లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసింది. కాగా, ఈ ఈ పిటిషన్‌పై గురువారం నాడు ఇరు వర్గాలు వాదనలను విన్పించారు. మద్రాసు, హైకోర్టు తీర్పులను ఏపీ ప్రభుత్వం గురువారం నాడు  హైకోర్టులో ప్రస్తావించారు.

ఈ విషయంపై వాదనలు నాలుగు గంటల పాటు జరిగాయి. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీనివాస్, వైసీపీ తరపున సీవీ మోహన్ రెడ్డి,  ఈసీ తరపున ప్రకాష్ రెడ్డి వాదనలను విన్పించారు.  ఐపీఎస్‌ల అధికారులను ఎన్నికల సమయంలో బదిలీ చేయడం ఆనవాయితీగా వస్తోందని  ఆయన ప్రశ్నించారు.  ఇంటలిజెన్స్ డీజీ  విషయంలో ప్రభుత్వం ఎందుకు పట్టుబడుతోందో చెప్పాలని  ఈసీ, వైసీపీ తరుపున న్యాయవాదులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  మొత్తానికి ఐపీఎస్ అధికారుల బదిలీలను నిలిపివేయాలని  ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.

ఈ బదిలీలపై సీఈసీ ఆదేశాల్లో  తాము జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు స్పష్టం చేసింది. నో కేస్ ఫర్ ఇంటెరిమ్ రిలీఫ్ అని ఆదేశాలిచ్చిన హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే తేదేపా ప్రభుత్వానికి ఇంతకు మించిన ప్రజాస్వామిక పరాజయం ఉండదేమో అని.. వైసీపీ, ఈసీ చేసిన వాదనలకు బలం చేకూరినట్టైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: