ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ ఆపాలని ఏపీ ప్రభుత్వం ఏకంగా కోర్ట్ కు కూడా వెళ్ళింది. కోర్ట్ తీర్పుతో టీడీపీ పరువు గంగలో కలిసి పోయిందని మాటలు వినిపిస్తున్నాయి.  వెంకటేశ్వరరావును ఆ పోస్టు నుంచి రిలీవ్ చేయకుండా, ఆ విషయంలో సీఈసీ ఆదేశాలు పనిచేయవని వాదించిన ఏపీ ప్రభుత్వ వాదనకు కోర్టు వత్తాసు పలకలేదు. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టంచేసింది.

ఈ వ్యవహారంలో మధ్యంతర ఉత్తర్వులు ఏవీ ఇవ్వలేదు హైకోర్టు. దీంతో సీఈసీ ఆదేశాలు తక్షణం అమల్లోకి రావడం ఖాయమైంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తమకు ఎంతో ప్రీతిపాత్రమైన వెంకటేశ్వరరావును రిలీవ్ చేయాల్సి వస్తోంది. ఎన్నికల వేళ కీలకమైన అధికారుల బదిలీల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వడం కొత్తకాదు. ఇదివరకూ కూడా ఇదే జరిగింది.

ఆయా సందర్భాల్లో సీఈసీ ఆదేశాలను ప్రభుత్వాలు పాటించాయి. అయితే.. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రం సీఈసీ ఆదేశాలు చెల్లవు అన్నట్టుగా వ్యవహరించింది. హుందాతనం మరిచి ప్రవర్తించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు వరకూ వెళ్లి ఎదురుదెబ్బ తిన్నది చంద్రబాబు నాయుడి ప్రభుత్వం. పోలీస్ లను కూడా తమ పార్టీ కోసం వాడుకోవాలని తపన బాబు గారికి తప్ప ఇంకెవ్వరికి ఉంటుదనండి.  ఇకనైనా బాబు ప్రభుత్వం దారికి వస్తుందా? 

మరింత సమాచారం తెలుసుకోండి: