కేజ్రీవాల్ కు వ్యక్తి గతంగా మంచి పేరు ఉంది. దేశ నడిబొడ్డులో ఒంటి చేత్తో తన పార్టీని గెలిపించుకున్నాడు. అయితే కాంగ్రెస్‌, బీజేపీలకు వ్యతిరేకంగా దేశంలో తామే ప్రత్యామ్నాయమన్న భావనను కలిగించడంలో కొంతమేర కేజ్రీవాల్‌ సఫలమయిన మాట వాస్తవం. కానీ, ఆ తర్వాత అనేక 'స్వీయ తప్పిదాలతో' అరవింద్‌ కేజ్రీవాల్‌ తన స్థాయిని తగ్గించుకున్నారు. ఇప్పుడు ఇంకోసారి అరవింద్‌ కేజ్రీవాల్‌ తన స్థాయిని తగ్గించుకోవాల్సి వచ్చింది.. అదీ చంద్రబాబు తరఫున ఆంధ్రప్రదేశ్‌లో ప్రచారానికి రావడం ద్వారా.


బీజేపీ వ్యతిరేక కూటమి.. అంటూ చంద్రబాబు హల్‌చల్‌ చేస్తున్న దరిమిలా, చంద్రబాబుకి కేజ్రీవాల్‌ 'అండగా' నిలబడటం రాజకీయాల్లో భాగమే కావొచ్చుగాక. కానీ, నాలుగేళ్ళు బీజేపీతో అంటకాగింది ఇదే చంద్రబాబు అన్న విషయాన్ని కేజ్రీవాల్‌ మర్చిపోతే ఎలా.? పైగా, బీజేపీతో అంటకాగిన నాలుగేళ్ళలో, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, అరవింద్‌ కేజ్రీవాల్‌పై పలుమార్లు నోరు జారేశారు.


ఆ విషయాలేవీ పట్టించుకోకుండానే, చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ని అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో చదివేయడం హాస్యాస్పదం కాక మరేమిటి.? మొత్తంగా 25 ఎంపీ సీట్లూ చంద్రబాబుకే కట్టబెట్టేయాలని కేజ్రీవాల్‌ ఓటర్లకి హుకూం జారీ చేసేశారు. పోనీ, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ - ఆమ్‌ ఆద్మీ పార్టీ మధ్య పొత్తుల్లాంటివి ఏమన్నా వున్నాయా.? అంటే అదీలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: