గుడివాడ అసెంబ్లీ సమరం ఆసక్తిదాయకంగా సాగుతోంది. ఒకప్పుడు తెలుగుదేశం కంచుకోటగా ఉన్న నియోజకవర్గం ఇది. తెలుగుదేశం పార్టీ పెట్టాక మొన్నటి ఎన్నికల్లో తప్ప..గతంలో ఒకే ఒక్కసారి ఇక్కడ తెలుగుదేశం ఓడిపోయింది. 


అంత బలంగా ఉన్నా.. ఇక్కడ కొడాలి నాని సొంత ఇమేజ్‌తో వరుసగా మూడు సార్లు హ్యాట్రిక్ కొట్టారు. ఇప్పుడు మరోసారి గెలుస్తానని ధీమాగా ఉన్నారు. కానీ కొందరు గుడివాడ సమరాన్ని బాహుబలి సినిమాతో పోలుస్తున్నారు. ఇదే విషయం నానిని అడిగితే అడిగిన వాళ్లకు భలే జలక్ ఇచ్చాడు నాని. 

అవును దేవినేని అవినాశ్ బాహుబలే నేను కాదనను.. కానీ ఇది బాహుబలి ఫస్ట్ పార్టు సినిమాలాంటిది. దేవినేని అవినాశ్ బాహుబలి అయితే ఆయన పక్కన ఒకరు కాదు.. ముగ్గురు కట్టప్పలు ఉన్నారు. ఆ ముగ్గురూ ఒకే సారి వెన్నుపోటు పొడుస్తారు.

పాపం.. అప్పుడు కానీ దేవినేని అవినాశ్‌కు విషయం తెలిసివస్తుంది. ఈ రాజకీయ బాహుబలిని ఓడించడానికి తనదాకా అవసరం రాదని కొడాలి నాని అంటున్నారు. ఆ పని ఆయన పక్కన ఉన్న ముగ్గురు కట్టప్పలే చేస్తారంటూ అదిరేలా కథ చెప్పారు కొడాలి నాని. ఎంతైనా సినీ నిర్మాత కదా. ఆ టాలెంట్‌ ఎక్కడకు పోతుంది మరి..!



మరింత సమాచారం తెలుసుకోండి: