ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావుడి రోజు రోజుకీ పెరిగిపోతుంది.  ఇప్పటికే ముఖ్య పార్టీ అధినేతలు తమ ప్రసంగాల్లో ప్రత్యర్థి పార్టీలపై విరుచుకు పడుతున్నారు.  అయితే ఏపిలో ‘ప్రజా సంకల్ప యాత్ర’తో అన్ని వర్గాల ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని వారి ఇబ్బందులు దగ్గరుండి చూసిన వైసీపీ అధినేత జగన్ కి ప్రజా బలం బాగానే పెరిగిందని అంటున్నారు ఏపి రాజకీయ విశ్లేషకులు.  తాజాగా వైసీపీ అధినేత జగన్ తల్లి వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుండెల్ని కదిలించే మాటలు మాట్లాడారు.   

ఏపిలో ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతోందని ప్రతిపక్ష నేత, తన కుమారుడు జగన్ ను అక్కున చేర్చుకున్న ప్రతీఒక్కరికి ఆమె ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు. విలువలకు, విశ్వసనీయతకు ఓటేయాలని ప్రజలను కోరారు. వైఎస్ పాలన జగన్‌తోనే సాధ్యమని... ఆయనకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైఎస్ పాలనతో పోల్చినప్పుడు ప్రస్తుత పాలన చూస్తే చాలా బాధ కలుగుతుందన్నారు.  వైఎస్ కుటుంబానికి, ప్రజలకు మధ్య 40 ఏళ్ల అనుబంధం ఉందన్నారు.

కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతకాలం రాజశేఖరరెడ్డి మంచోడని జగన్ బాబు మంచోడని అన్నారు..కానీ పార్టీ నుంచి బయటకు రాగానే కేసులు పెట్టారు. అరెస్ట్ చేశారు..మానసికంగా ఎంతో ఇబ్బంది పెట్టారు. కానీ మనోనిర్భరంతో ఓదార్పుయాత్ర చేస్తానని ఆరోజు జగన్ మాటిచ్చాడు. ప్రజలే మా కుటుంబం అనుకున్నాడు. జగన్ ఏదైనా అనుకుంటే చేస్తాడు. జగన్ ఏదైనా అనుకుంటే సాధిస్తాడు. ప్రజల ఆశీర్వాద బలమే జగన్ ను ముందుకు నడిపిస్తోందని ఆమె అన్నారు.

తన భర్తను పోగొట్టుకున్న సమయంలో 16 నెలలు తన కుమారుడు జగన్ ను జైలులో పెట్టి దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ 9 సంవత్సరాల్లో నాతో ఎప్పుడూ గడిపింది లేదు. వైఎస్ జగన్ కుటుంబం కంటే ప్రజలతోనే ఎక్కువ మమేకమై ఉన్నారు. ఇక చేసిన అభివృద్ధిని చెప్పుకోలేని చంద్రబాబు.. ఎన్నికల ప్రచారంలో జగన్ జపం చేస్తున్నారని తెలిపారు. కాగా,  ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయమ్మ ప్రకాశం జిల్లా కందుకూరు, కనిగిరి, మార్కాపురంలో జరిగే ప్రచార సభల్లో పాల్గొంటారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: