ఒక ఘటనకు స్పందించే విధానాన్ని బట్టే వారి వ్యక్తిత్వాన్ని నాయకత్వ లక్షణాలను అంచనా వేయవచ్చు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే ఏపీ సీఎం చంద్రబాబు... ఈసీ తీసుకున్న రాష్ట్ర పోలీసు అధికారుల బదిలీలపై నానా రచ్చ చేస్తున్నారు. తనకు ఎవరు నచ్చకపోతే వారు మోడీతో కుమ్మక్కయ్యారని అనడం ఇటీవల చంద్రబాబుకు అలవాటుగా మారిపోయింది. 


కొంత కాలం నుంచి ఆయన కేంద్రంపై కత్తి దూస్తున్నారు. ఆ తర్వాత సీబీఐని ఏపీకి రానివ్వబోమన్నారు. ఐటీదాడుల కుట్రపూరితం అన్నారు. ఇప్పుడు ఈసీ కూడా మోడీతో కుమ్మక్కైందని చెబుతున్నారు. ఎలాంటి సంజాయిషీ అడగకుండా ఇంటలిజెన్స్ డీజీని బదిలీ చేస్తారా అంటూ గగ్గోలుపెట్టారు. అంతే కాదు.. ఏకంగా ఆ బదిలీని నిలిపేస్తూ జీవో ఇచ్చేశారు.

చివరకు హైకోర్టు.. తాము ఈసీ అధికారాల్లో జోక్యం చేసుకోలేమంటూ చంద్రబాబుకు షాక్ ఇచ్చింది. కానీ సేమ్‌ సీన్ గతంలోనూ ఒకసారి జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. అది 2009 సంవత్సరం. ఎన్నికల సమయం. అప్పుడు ఇదే చంద్రబాబు టీమ్ అప్పటి డీజీపీపై ఆరోపణలు చేసింది. ఈసీకి ఫిర్యాదు చేసింది. 

ఈసీ డీజీపీని బదిలీ చేసింది. అప్పుడు సీఎంగా ఉన్న రాజశేఖర్ రెడ్డి దీనిపై హుందాగా వ్యవహరించారు. అదే సీఎం వైఎస్.. మళ్లీ ఎన్నికలు కాగానే మళ్లీ తాను ముఖ్యమంత్రి కాగానే పాత డీజీపీనే మళ్లీ డీజీపీగా నియమించుకున్నారు. అప్పుడు కేంద్రంలో ఉన్న తన కాంగ్రెస్‌ గవర్నమెంటే.. కావాలంటే ఆయన రచ్చ చేసేవాడే. కానీ ఆయన వ్యవస్థల పట్ల హుందాతనం.. పదవుల పట్ల గౌరవం చూపాడు. అదీ తేడా.     



మరింత సమాచారం తెలుసుకోండి: