నారా చంద్రబాబు నాయుడు అసలు ప్రజాపాలనకు పనికి రారు అన్నంతగా మారిపోయారని అంటున్నారు జనం. కాని ఏదైనా ప్రొడక్ట్ మార్కెట్ లో కొనటానికి / అమ్మటానికి అంటే మార్కెటింగ్ కు పనికి వస్తారనేది కనిపిస్తుంది. పరిపాలన మార్కెటింగ్ కాదాయె! అధికారం పొందటానికి ప్రజాసేవే అత్యుత్తమ మార్గం. ఆయన అనుసరించేది మాత్రం అధికారం కొనే అష్టవిధ వక్రమార్గాలు. ఎమెల్యే లను కొనడం నుండి పోలీస్ అధికారులతో రాజకీయ లాలూచీ వ్యవహారాలు చేయటం వరకు. 



నేను రోడ్లెయించాను,  కరంట్ ఇచ్చాను,  పాఠశాలలు కట్టించాను ఇలా చేసినపనులు చెప్పి ఓట్లు నాకే వేయాలి, మీకు పెన్షన్లు ఇచ్చాను కాబట్టి దేవుడిపై ప్రమాణం చేసి చెప్పంది నాకే ఓటు వేస్తానని అనేది మార్కెటింగ్. ఎవరూ చేయని ఈ పనులు నా వాగ్దానాల ప్రకారం చేశాను కాబట్టి మీరు నాకు ఓటు వేయండి అని అభ్యర్ధించటం ప్రజాస్వామ్య లక్షణం. ఆయన వాడిన పదజాలం చూస్తే ప్రతిపక్షాలేకాదు తటస్థులు కూడా ఓటేయరు.  
 


ప్రజాస్వామ్యం అంటే ప్రజాసంక్షేమం మనసులో పెట్టుకొని చేసేపాలన. మార్కెటింగ్ అంటే సరుకులు కొనటం అమ్మటం ద్వారా డబ్బు మిగుల్చుకునే ప్రక్రియ అలా కూడ బెట్టిన సొమ్ము కుటుంబం - కుమారుడు, కోడలు, మనవడు, భార్య కోసం ఖర్చు పెట్టటం లేదా మిగిలిన దాంతో సంపద సృష్టించటం కోసం వినియోగించుకుంటారు.

ab venkateswara rao ips high court కోసం చిత్ర ఫలితం
పాపం! ఆయనకు ప్రజాపాలన అంటే తెలుసో? తెలియదో? కాని కుమారునికి దొడ్డిదారిన ఎమెల్సీ హోదా సాదించి దాని ద్వారా కొన్ని ప్రయోజనాలిచ్చే పోర్టిఫోలియో లతో మంత్రిపదవి ప్రసాదించేశారు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అడిగేవాడు లేడు. ప్రశ్నలు అడగటానికే పుట్టిన పవన్ కళ్యాణ్  ప్రస్తుతం  నాటకాలు వేస్తున్నారు.  ఎందుకంటే ఆయన ఎక్కడో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీని, ఏ అధికారంలేని జనాల్లో తిరిగే వైఎస్ జగన్మోహనరెడ్డిని మాత్రమే ప్రశ్నిస్తారట.


మోదీ నుండి విభజన ఫలాలను ఎందుకు రాబట్టలేదో? ప్రశ్నించరట. కాని నరేంద్ర మోడీ ప్రత్యేక హోదా ఎందుకు యివ్వలేదని ప్రశ్నించే ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా అందుకోసం చేసిన నిర్మాణాత్మక ప్రయత్నాలను సాక్ష్యాధారాలతో చూపించాలి. ధర్మ పోరాట దీక్షల్లో మోడీని అడగటం కాదు? చట్టబద్ద ప్రయత్నం కావాలి. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. ఆయన మోడీ విభజనఫలాలు యివ్వట్లేదని ప్రజల ముందు ఏడిస్తే ఆయన నాలా మీలా సామాన్యుడే అవుతాడు. మన సామూహిక శక్తిని ఓట్ల రూపంలో చంద్రబాబుకు దారపోసి ప్రభుత్వ అధికారం కట్టబెట్టాం. దాన్ని ఆయుధంగా మలుచుకొని రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను వాడు కొని ప్రజలపట్ల బాధ్యతలను నెరవేర్చాలి. అలా చేయలేక పొయారంటే అందులో ఏదో "లాలూచీ" ఉన్నట్లే.
ap high court on AP Venkatesvara rao Transer case కోసం చిత్ర ఫలితం  
ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ నిర్వచిత  ప్రజాపాలన అవసరం. మార్కెటింగ్ అవసరం లేదు. అలాంటి మార్కెటింగ్ పనులు అంటే బ్రోకరేజులు, అమ్మకాలు కొనడాలు చేయటంలో సిద్ధహస్తులు చంద్రబాబు తన చుట్టూ నిర్మించుకున్న వ్యాపార సామ్రాజ్యంలో ఉన్నారు. అలాంటి వాళ్లను ఆయన తన ప్రాణం ఫణంగా పెట్టైనా కాపాడు కుంటారు. బహుశ ఏబి వేంకటేశ్వర రావును స్వరాజకీయాలు సాధించి పెట్టటానికి తన దగ్గర ఉంచుకోవటానికి "ఎలక్షన్ కమీషన్ లాంటి రాజ్యాంగ వ్యవస్థ" ను సైతం "ధిక్కరించి ఢీ కొనటానికి" సిద్ధపడ్డారు చంద్రబాబు.  
అనుభవమున్న నాయకుడెవడూ రాజ్యాంగ వ్యవస్థ లను ఇలా అవహేళన చేసిన దాఖలాలు ప్రజాస్వామ్య చరిత్రలోలేవు. అధికారంరాదన్న నమ్మకం ఉండి అరాచకం లేవదీసే అరాచకవాదులు సాధారణంగా ఇలాంటి పనులు చేస్తారు. 
సంబంధిత చిత్రం
ఏపి హైకోర్ట్ నేడు ఎలక్షన్ కమీషన్ అదేశాలలో కలగ చేసుకోలేమని చెప్పాటంతో రాజ్యాంగ వ్యవస్థకు న్యాయ వ్యవస్థ ఊపిరి పోసినట్లే. లేకుంటే ఈయన ఉపన్యాసాలు వేలకొలది తన సామాజిక వర్గ మీడియా గొట్టాల నుండి వినల్రేక చచ్చేవ్ఆళ్ళమని ప్రజల్లో చర్చలు నడుస్తున్నాయి.  ఈ తీర్పుతో చంద్రబాబు నైతికంగా జీవన్మృతుడే. ఆయన్నే ఎందుకు ఈ మాట అనవలసి వచ్చిందంటే - వ్యవస్థలన్నింటిని తన పిడికిట్లో పెట్టుకోవటమే.


అదే లేకుంటే ఈ పాపం జరగదు ఒకవేళ జరిగినా 'అకౌంటబిలిటీ' సరిగ్గా ఉండేది. ఇప్పుడు అన్నిటికి చంద్రబాబే అకౌటబుల్. ఏబి వెంకటేశ్వరరావు ఒక ప్రజొద్యోగి. ఆయన ప్రజలకు ఎక్సెప్షణ్ కాదు. ఆయనకు రాష్ట్ర పోలీసుల్లో ప్రత్యామ్నాయమే లేరా? కిడారి సోమల మరణానికి కారణం "ఏబి వెంకటేశ్వరరావు" బాధ్యతా అలక్ష్యమే. నిర్లక్ష్యమే. ఆయన ప్రజాస్వామ్య వృత్తిని వదిలేసి పార్టీ పని చేపట్టారు. అందుకే నైతికంగానే కాదు ...ఒక సాధారణ పౌరుని దృష్టి కోణంలోను ఏబి వెంకటేశ్వరరావు నేఱస్తుడే. 
ab venkateswara rao ips high court కోసం చిత్ర ఫలితం
ఈ ముగ్గురు ఉద్యోగుల కోసమే పని చేస్తున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుని చరిత్ర గుర్తుంచుకుంటుంది. 


రాష్ట్రంలో ఇంటెల్లిజెన్స్ అట్టర్ ఫ్లాప్. చెప్పాలంటే నియామకాల ప్రకారం-- హి ఈజ్ లయబుల్ ఫర్ పనిష్మెంట్--ప్రభుత్వం అతన్ని వెనకేసుకు వస్తుంది కాబట్టి - "ప్రభుత్వాధినేత ఎవరైనా నేరస్థుడే"  ఈ ఐదేళ్ళూ రాజ్యాంగవ్యవస్థలను నిందిస్తూ గిల్లికజ్జాలు పెట్టుకుంటూ పాలించే ప్రభుత్వం ప్రజాదర్బార్ లో ఖచ్చితంగా నిందితురాలే.  రేపు ఎవరు అధికారంలోకి వచ్చినా వారికి కూడా ఇది హెచ్చరికే. 

మరింత సమాచారం తెలుసుకోండి: