ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ ఫీవర్‌ పీక్ లెవల్‌కు చేరుతోంది. ముక్కోణ పోటీలో గెలుపెవరిదన్న ఉత్కంఠ అందరినీ ఊపేస్తోంది. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎలాంటి ఫలితాలు వస్తాయో తేల్చేందుకు ప్రికి న్యూస్ అనే సంస్థ డిటైల్డ్ సర్వే నిర్వహించింది. 


ప్రతి జిల్లాలోనూ శాంపిల్స్ తీసుకుని సర్వే నిర్వహించినట్టు ఆ సర్వే నిర్వాహకులు తెలిపారు. ప్రతి జిల్లాలోనూ నియోజకవర్గాల వారీగా ప్రజల ఓటింగ్ శాతాన్ని కూడా ఈ సర్వే చెబుతోంది. ఈ సర్వే ప్రకారం.. జనసేనకు రెండంకెల స్కోరు వస్తుందని తెలిపింది. 

రెండంకెల స్కోరు అనగానే మరీ ఎక్కువ ఊహించుకోవద్దు.. జనసేన రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేసినా.. ఆ పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే గెలిచే అవకాశం ఉందని ఆ సంస్థ తెలిపింది. ఆయా స్థానాల వివరాలను కూడా బయటపెట్టింది. 

జనసేన గెలిచే 11 స్థానాలు ఏంటో ఒకసారి చూద్దాం.. జిల్లాల వారీ వివరాలు చూస్తే.. శ్రీకాకుళం జిల్లా జనసేన పాలకొండ స్థానం గెలిచే అవకాశం ఉంది. విశాఖ జిల్లాలో జనసేనకు 4 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉందట. పవన్ కల్యాణ్ గాజువాకలో గెలుస్తారు. ఆయనతో పాటు... పెందుర్తి, అనకాపల్లిలోనూ ఆ పార్టీ అభ్యర్థులు గెలుస్తారు. 

తూర్పు గోదావరి జిల్లాలో.. జనసేనకు 4 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉంది. అవేమిటంటే.. పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ రూరల్, రాజానగరం. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో..జనసేనకు 2 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉంది. భీమవరంలో పవన్ కల్యాణ్ తో పాటు తాడేపల్లి గూడెంలోనూ ఆ పార్టీ గెలుస్తుందట. 

సో.. ఈస్ట్ గోదావరి - నాలుగు, విశాఖ జిల్లా -నాలుగు, పశ్చిమ గోదావరి - రెండు, శ్రీకాకుళం - ఒకటి.. ఇలా మొత్తం 11 స్థానాలు గెలిచే ఛాన్స్ ఉందట. అదీ జనసేన పార్టీ గురించి ఈ సర్వే సంస్థ చెప్పిన విశేషాలు. 


మరింత సమాచారం తెలుసుకోండి: