ఏపీ ఎన్నికల రణరంగం మాంచి జోరుగా ఉంది. గెలుపోటములపై అంచనాల లెక్కలు వస్తున్నాయి. చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారా.. లేక.. ఈసారైనా ముఖ్యమంత్రి కావాలన్న జగన్ కోరిక నెరవేరుతుందా.. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉందో తెలిపేందుకు ప్రికి న్యూస్ అనే సంస్థ డిటైల్డ్ సర్వే నిర్వహించింది. 


ప్రతి జిల్లాలోనూ శాంపిల్స్ తీసుకుని సర్వే నిర్వహించినట్టు ఆ సర్వే నిర్వాహకులు తెలిపారు. ప్రతి జిల్లాలోనూ నియోజకవర్గాల వారీగా ప్రజల ఓటింగ్ శాతాన్ని కూడా ఈ సర్వే చెబుతోంది. ఈ సర్వే ప్రకారం..జిల్లాల వారీ వివరాలు చూస్తే.. రెండు జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయనుంది. 

ప్రకాశం జిల్లాలో మొత్తం 12 స్థానాలు ఉన్నాయి. వైసీపీ ఈ జిల్లాలో అన్ని స్థానాలు గెలుచుకుంటుందని ఈ సర్వే చెబుతోంది. అలాగే నెల్లూరు జిల్లాలో కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేయనుంది.. మొత్తం నియోజకవర్గాలు ఆ పార్టీనే గెలుచుకుంటుంది. టీడీపీ, జనసేన ఖాతా తెరిచే ఛాన్సు లేదు. 

ఈ రెండింటి తర్వాత కడప జిల్లాలోనూ వైఎస్సార్ పార్టీ జోరు మీద ఉంది. ఈ జిల్లాలో ఒక్క జమ్మలమడుగు తప్ప అన్ని స్థానాల్లోనూ వైసీపీ గెలిచే ఛాన్స్ ఉంది. జగన్ పులివెందులలో గెలుస్తారు. ఓవరాల్‌ గా వైసీపీకి 124 స్థానాలు వస్తాయని ఈ సర్వే చెబుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: