ఎలక్షన్స్ జరగడానికి పట్టుమని 20 రోజులు కూడా లేవు ఇలాంటి సమయంలో రాజకీయ నాయకులంతా వారి వారి నియోజకవర్గాల్లో ప్రచారాలతో బిజీగా ఉంటారు. ఇలా ఉండగా టీడీపీ పార్టీ లో మాత్రం అంతర్గత విభేదాలు, గొడవలకు తెరలేస్తున్నాయి. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కొందరు ఎమ్మెల్యేలు ఎంపీ అభ్యర్థిని ఖాతరు చేయకుండా వ్యవహరిస్తున్నారనేది సమాచారం. ఇంకా సూటిగా చెప్పాలంటే ప్రచారం పేరుతో తమ నియోజకవర్గాల్లో అడుగు పెట్టవద్దంటూ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థులు కొందరు ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ కు నిర్మొగమాటంగా చెబుతున్నారట.

గత ఎన్నికల్లో గల్లా జయదేవ్ కుటుంబం కాంగ్రెస్ ను వదిలి టీడీపీ లోకి వచ్చింది. ఆ టైమ్ లో జయదేవ్ ఎంపీ గా పోటీ చేసి గెలుపొందారు. ఆయన తన ఐదేళ్ల పాలనలో చేసింది ఏమిటయ్యా అంటే చివరి ఏడాది లో మోడీని ఉద్దేశిస్తూ ఆవేశంగా ప్రసంగం ఇవ్వడం. దీనికే ఆయన ఏదో గొప్పగా సాధించినట్టు చాటింపు వేయించుకున్నారు. ఇక్కడ జయదేవ్ కు స్థానికంగా అందుబాటులో ఉండని నాయకుడుగా అపారమైన పేరుంది. ‘తప్పిపోయిన ఎంపీ’ అంటూ ఆయన గురించి గతంలో కొందరు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడానికి కూడా ప్రయత్నించారు.

ఈ దెబ్బతో ఎంపీ జయదేవ్ ప్రచారం కి వస్తే పడే ఓట్లు కూడా గల్లంతు అవుతాయి అని లోకల్ ఎమ్మెల్యే లు భయపడుతున్నారు అంట. మీరు ప్రచారానికి రావొద్దు మహాప్రభో అంటూ జయదేవ్ కి చెప్పుకుంటున్నారు అంట. జయదేవ్ మీద ఉన్న వ్యతిరేకత తమ మీద కూడా దుష్ప్రభావం చూపిస్తుందనే భయంతో గుంటూరు పార్లమెంటు పరిధిలోని ఏడింటిలో రెండు –మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు తమ ఊర్లకు రావద్దని వేడుకుంటున్నారట. మరి ఇలా సొంత పార్టీ వల్లే వద్దు అంటుంటే జయదేవ్ పరిస్థితి ఏంటో, ఎలా ఉంటుందో మరీ. ఎంపీ గా ఈసారి గట్టేగలరా లేదా అన్నది చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: