ఎన్నికల వేడి  బానుని ఎండ ప్రతాపాన్ని తరిమికొట్టేట్టున్న ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హామీలు కుప్పలు  తెప్పలుగా వస్తూనే ఉన్నాయి. ఈ హామీలు ఎలా ఉన్నాయంటే వెంటనే ఫక్కున నవ్వొచ్చే విధంగా... మనవాళ్ళు ఏంటి మనల్ని ఇంత లోకువగా చూస్తున్నారనే విధంగా..ఎందుకు వాళ్లలో తింగరి మాటలు మాట్లాడ్తారు అని  భాద పడే విధంగా.


ఒకాయనేమో మంగళగిరిని సింగపూర్ చేస్తానంటాడు..దేవుడా మా దగ్గర ఉత్త పుణ్యానికి తీసుకున్న భూములకు లాభం చూపించక పోగా మేము బతకలేము అని ఆ ప్రాంతవాసులంటుంటే సింగపూర్ ఖాయం రాస్కోండంటారు.  ఇంకొయానేమో 70 ఏళ్ల వయస్సులో మీ ఇంటికి నేను పెద్ద కొడుకునంటారు. ఇళ్లలో ఉన్న తండ్రుల వయస్సు 70 ఏళ్ళ లోపే ఉంటే పెద్దకొడుకు వయస్సు మాత్రం 70 ఏళ్ల పైనే..


ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి నగరాన్ని హైదరాబాదు చేస్తారంట... అంటే మన రాజమండ్రి, కాకినాడ, కర్నూలు, విజయనగరాలు అన్నీ హైదరాబాదులయ్యి కోటి మంది జనాలు, లక్షల ఉద్యోగాలు, వేల కోట్ల సంపాదన ప్రతి నగరంలోనూ.. అలాయితే ఆంధ్రప్రదేశ్ ప్రపంచదేశాలన్నింటిలోనూ అత్యంత ధనిక రాష్ట్రం అవుతుంది..నవ్వొస్తుందా..భాదేస్తుందా..?

మరింత సమాచారం తెలుసుకోండి: