ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు నెరవేర్చకుండా ఇప్పుడు ఎంగిలి చేయి విదిలిస్తే సరిపోతుందని అనుకుంటు న్నారని వైసిపి  నేత వైఎస్ షర్మిల అన్నారు. మంగళగిరిలో జరిగిన భారీ బహిరంగసభలో ఆమె మాట్లడుతూ ముఖ్యమంత్రిని చీల్చి చెండాడారు. 
YS Sharmila Questioned Chandrababu Putravatsalyam కోసం చిత్ర ఫలితం
రైతు ఋణాలు, డ్వాక్రా మహిళల ఋణాలు మాఫీ చేస్తామని చెప్పి రైతులను మహిళలను నిలువునా ముంచేశారని, మోసం చేశారని ఆమె ఘాటుగా విమర్శించారు. తాను మాత్రం కార్పొరేట్ ఆస్పత్రులకు వెళుతూ, పేదలు మాత్రం ప్రభుత్వ ఆస్పత్రులకే వెళ్లాలని చెబుతున్నాడని ఆమె తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. పోలవరం మూడేళ్లలో పూర్తి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇంతవరకు ఆ పని చేయలేదని వై ఎస్ షర్మిల అన్నారు. 


అమరావతిలో రైతుల నుండి భూములు లొక్కున్న తీరు వారిని వంచించిన తీరు వలన రైతుల ఉసురు ముఖ్యమంత్రి చంద్ర బాబుకు తగలకుండా ఉంటుందా? అని షర్మిల ఉసురు తగలాలనే కోరారు. 


ఇంత చేతకాని, అబద్ధాల ముఖ్యమంత్రి ఏపి ప్రజలకు అవసరమా? బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి, చివరికి బాబుగా తన కొడుకు లోకేష్ కే ఉద్యోగం వచ్చిందని, ఏ సమర్ధత లేని ఈ పప్పుకు జయంతికి, వర్దంతికి కూడా తేడా తెలియదని ఆమె అన్నారు. ఎప్పుడు అనుభవం గురించి మాట్లాడే ముఖ్యమంత్రి - ఏ అర్హత ఉందని, ఏ అనుభవం ఉందని తన కుమారుణ్ణి మూడు శాఖలకు మంత్రిని చేశారని వైఎస్ షర్మిల సూటిగా ప్రశ్నించారు. నాడు జగన్ కు అనుభవం లేదన్న చంద్రబాబు తన కొడుకు లోకేష్ కు ఏ అనుభవముందని మంత్రి పదవి ఇచ్చారని అన్నారు.   


చంద్రబాబుది పుత్ర వాత్సల్యం కాదా? అని ఆమె ప్రశ్నించారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు కెటిఆర్ మాదిరిగా తనకు ఐటి శాఖ కావాలని తీసుకుని లోకేష్ ఒక్క ముఖ్యమైన కంపెనీ కూడా ఏపికి తీసుకు రాలేక పోయారని ఆమె అన్నారు. లోకేష్ మైక్రోసాప్ట్ కంపనీ వస్తుందని ప్రచారం చేయగా - మైక్రోసాఫ్ట్ అలాంటిదేమీ లేదని ప్రకటించారని, అంతటి సమర్దుడు ఈ పప్పు గారు అని సెటైలు వేశారు. ప్రభుత్వ దగ్గరున్న ప్రజా సమాచారం అంతా దొంగిలించి తనకు అతి దగ్గరవారైన ప్రైవేటు కంపెనీ లకు ఇచ్చి ప్రజలకు భద్రత  లేకుండా చేశారని ఆమె ఆరోపించారు.

YS Sharmila Questioned Chandrababu Putravatsalyam కోసం చిత్ర ఫలితం

రాష్ట్ర విభజన చోటుచేసుకున్న ఈ సమయం అత్యంత కీలకమైన ఎన్నికలని వైఎస్ షర్మిళ అన్నారు. రాష్ట్రంలో భూతద్దం పెట్టుకుని వెదికినా అభివృద్ధి కనిపించట్లేదని అన్నారు. ఎన్ని పరిశ్రమలు వచ్చాయా? రైతు బాగుపడుతున్నాడా? పేద వాడు సంతోషంగా ఉన్నాడా? పేద విద్యార్థికి భరోసా ఉందా? అని ఆమె ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డి హాయంలో కళకళలాడిన రాష్ట్రమని అన్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో పేద కుటుంబం, రైతు కుటుంబం ధైర్యంగా ఉండేదని అన్నారు. పేద విద్యార్థి ఉచితంగా చదువుకునే భరోసా ఉండేదని అన్నారు. కార్పొరేట్ వైద్యాన్ని అందించారని చెప్పారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా ప్రతి వర్గానికి వైఎస్ మేలు చేశారని షర్మిళ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: