నారా లోకేష్ 2019 ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల భరిలోకి దిగుతున్నారు. గత కొన్ని నెలల నుంచి ఏ నియోజక వర్గం అయితే బాగుంటందని సర్వే చేసి చివరికి లోకేష్ కోసం మంగళగిరి నియోజక వర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. నిజానికి ఇదేమీ టీడీపీకి కంచు కోట లాంటిదేమీ కాదు. ఇక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రూపంలో బలమైన ప్రత్యర్థి ఉన్నాడు. దీనితో విజయం అంత సులభం కాదు. 


అయితే లోకేష్ ఇక్కడ గెలవడానికి ఆయన అన్నిరకాల ఉపాయాలు ఆలోచిస్తున్నారు. వినియోగిస్తున్నారు. నంద్యాల మాదిరిగానే రకరకాల టెక్నిక్ లు వాడుతున్నారు. వాటిలో ఒక టెక్నిక్ చాలా బలంగా వుందన్న గుసగుస రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఓట్లు బలమైన వర్గాలను, జనాలను గుర్తించి, వాళ్ల వివరాలు సేకరించి, గప్ చుప్ గా వాళ్ల పేరున 50 గజాలు, 100 గజాలు వంతున పట్టాలు పాత డేట్ తో తయారుచేయించి, సైలంట్ గా ఇళ్లలోకి అవి పడేసి పోతున్నారని టాక్ వినిపిస్తోంది. సగటు మనిషికి ఇల్లు అన్నది జీవితాశయం. అలాంటిది 50 నుంచి 100 గజాలు స్థలం అంటే అంతకన్నా ఆనందం ఇంకేం వుంటుంది.


ఎకరా బంజరు వున్నా, లేదా కాస్త విలువ తక్కువ స్థలం వున్నా వంద మందికి పంచవచ్చు. సుమారు 10 లక్షలు విలువైన ప్రయివేట్ లాండ్ అయినా కుటుంబానికి 10వేలు పడుతుంది ఖర్చు. కుటుంబంలో అయిదారు ఓట్లు వుంటాయి అనుకంటే ఓటుకు రెండు మూడువేలు. నగదు రూపంలో ఇచ్చేకన్నా, ఇలా ఇవ్వడం వల్ల ప్రయోజనం కచ్చితంగా సమకూరుతుంది. అదీ ఐడియా. తెలుగదేశం పార్టీ మంగళగిరి స్థానాన్ని ప్రెస్టీజియస్ గా తీసుకుంది కాబట్టి, ఇక్కడ ఖర్చు గురించి ఆలోచించే వ్యవహారమే వుండదుగా.



మరింత సమాచారం తెలుసుకోండి: