చాణక్యుడి తర్వాత అంతటి వాడుగా చెప్పుకునే చంద్రబాబు ఇటీవల వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం చాలా మెట్లు దిగజారి ప్రవర్తిస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఐదేళ్లు పాలించిన చంద్రబాబు తన సర్కారు పనితీరును ప్రజల్లో చెప్పుకుని.. ఇదిగో ఇలా కష్టపడ్డా.. మీరు మళ్లీ గెలిపించండి అని చెప్పడం మానేసారు. పని తీరు బేసిక్‌గా ఓట్లు అడిగితే మళ్లీ అధికారంలోకి రాలేమని బహుశా ఆయన బలంగా నమ్ముతున్నట్టున్నారు. 


అందుకే.. చివరి నిమిషంలో ప్రకటించిన సంక్షేమ పథకాలపైనా.. వై.ఎస్. వివేకానందరెడ్ హత్య వంటి ఘటనలపైనో .. మోడీనో,కేసీఆర్‌నో తిట్టుకుంటూనే ఈ ఎన్నికల బండి లాగించేయవచ్చని భావిస్తున్నట్టున్నారు. నేరాన్ని నేరంగా చూడాలి.. నేరాలను రాజకీయాలకు వాడుకుంటే.. నిజాలు సమాధి అవుతాయి. 

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ విషయంలో జరుగుతున్నది ఇదే. హత్య జరిగి ఇప్పటికి పక్షం రోజులు దాటుతున్నా.. ఇంతవరకూ హత్య చేసిన వ్యక్తిని పట్టుకోలేకపోయారు. కనీసం గుర్తించలేకపోయారు ఏపీ పోలీసులు. కానీ అదే హత్య ఘటనను చంద్రబాబు రోజూ సభల్లో ప్రస్తావిస్తున్నారు. 

ఓ కీలకమైన కేసు విచారణ దశలో ఉండగానే దర్యాప్తును ప్రభావితం చేసేలా పదే పదే మాట్లాడటం ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగని పని. కానీ.. జగన్‌ ను దోషిగా చూపించడానికి.. జగన్ కుటుంబంపై బురద జల్లడానికి బహుశా చంద్రబాబు ఇంత కంటే మంచి ఉదాహరణ వేరొకటి దొరకలేదేమో.

ఈ అంశంపై తాజాగా ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు చంద్రబాబుకు నిజంగా చెంపపెట్టు లాంటిదే.. ఏపీలో ఎన్నికలయ్యే వరకూ ఈ హత్య కేసుపై రాజకీయ నాయకులు ఎవరూ మాట్లాడకూడదని కోర్టు తీర్పు ఇవ్వడం నిజంగా హర్షణీయం.  పాపం ఇక చంద్రబాబు.. జగన్‌ను తిట్టడానికి వేరే కారణాలు వెదుక్కోవాల్సిందే..!



మరింత సమాచారం తెలుసుకోండి: