ఇక్కడ ఏపిలో రాజకీయంగా కుమారుడు సూర్యునిలా అస్తమిస్తేనే, అభివృద్ధి అనే సూర్యోదయం అవుతుంది అంటూ నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై విరుచుకుపడ్డారు. దీంతో సార్వత్రిక ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలు జరుగుతున్న ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయం సెగలు గక్కుతుంది, హీట్ అమాంతంగా పెరిగిపోయింది. అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా చేసుకుని “వైసీపీ - టీడీపీ – జనసేన” ల మధ్య ముక్కోణ పోరాటం జరుగుతుండగా - మాటల ఫిరంగుల మందుగుండు పేలుతుంటే- లోక్ సభ ఎన్నికలను కేంద్రంగా చేసుకుని బీజేపీ కూడా తనదైన శైలిలో రాజకీయ మంత్రాంగం ఏపిలో కూడా నడుపటం ప్రారంభించింది. 


ఏపీలో ఒంటరిగా సమరరంగంలోకి దిగితే ఒక్క సీటు కూడా దక్కించుకోలేని స్థితిలో ఉన్నప్పటికి బీజేపీ, పోరాడితే  ప్రజల ముంగిట్లోకి చేరితే తమ రాజకీయ పరిస్థితి కొంతైనా మెరుగుపడక పోతుందా? అన్న కోణంలో సర్వశక్తులను ఒడ్డుతోందనే చెప్పక తప్పదు.  ఎన్నికల ప్రచార పర్వంలో నేడు ఏపిలో పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు వేదికగా నిర్వహించిన బహిరంగ సభలో తనదైన శైలిలో ప్రసంగించారు. 

ప్రధానంగా టీడీపీని చంద్రబాబును లక్ష్యంగా చేసుకున్న నమో - టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై తన దైన శైలిలో పంచ్ లు – సెటైర్లు-మాటల తూటాలు  సంధించారు. గతంలో చంద్రబాబును “యూటర్న్ బాబు” గా అభివర్ణించిన మోదీ, ఈ సారి “స్టిక్కర్ల బాబు” గా అభివర్ణించారు.  కేంద్ర ప్రభుత్వ పథకాలకు తన “స్టిక్కర్లు” వేసుకుని, ఆ పథకాలు తనవేనని చెప్పుకునే స్థాయికి దిగజారారని చంద్రబాబుపై నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు.


కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకు సంబంధించిన లెక్కలు అడిగితే చంద్రబాబు అడ్డం తిరిగారని మోదీ ఆరోపించారు.  ఈ క్రమం లోనే యూ టర్న్ తీసుకొన్న చంద్ర బాబు, నిధులు ఇస్తున్న తనను కేంద్రాన్ని టార్గెట్ చేశారని మండి పడ్డారు. కేంద్ర నిధులకు లెక్కలు చెప్పే బాధ్యత విస్మరించిన చంద్రబాబు పాలన గురించి ఈ సందర్భంగా మరో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించారు. చంద్రబాబు హయాంలో భారీ ఎత్తున సాగుతున్న అవినీతిని ప్రజల కళ్లకు కట్టేలా చెప్పిన నరేంద్ర మోదీ తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు. 
narendea modi punches on chandrababu and his corruption కోసం చిత్ర ఫలితం
సాధారణంగా పథకాలలో కుంభకోణాలు జరుగుతాయని కానీ ఏపీలో చంద్రబాబు పాలనలో అందుకు విరుద్ధమైన పరిస్థితి నెలకొందని – అదేమంటే మొదట ఎంత అవినీతి చెయబోతున్నారో అంచనా వేసి, ఆ తర్వాత దానికి తగినట్లు పథకాలను రూపొందిస్తున్నారని నరేంద్ర మోదీ మండిపడ్డారు.  ఏపీకి ఇచ్చిన నిధుల లెక్కలు అడగటమే పాపమైందన్న పద్దతిలో నారా చంద్రబాబు నాయుడు  వ్యవహరిస్తున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు. తమను బూచిగా చూపుతూ రాష్ట్రాభివృద్ధిని పక్కనపెట్టి, దేశ వ్యాప్త అవినీతి నేతలతో చంద్రబాబు జట్టు కట్టారని ఆరోపించారు. ఏపీ అభివృద్ధిపై చంద్రబాబు ఫోకస్ చేయనే లేదని కూడా నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 


రాష్ట్ర అభివృద్ధి ప్రక్కన బెట్టి కేంద్ర పథకాలకు తన ప్రభుత్వ స్టిక్కర్లు తన ఫొటోలతో వేసుకొని ప్రచారం చేస్తూ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ఏపీ అభివృద్ధి కోసం మరోసారి తమ పార్టీకి అవకాశం ఇవ్వాలని,  కేంద్రంలో - రాష్ట్రంలో తమకు రెండుచోట్ల అధికారం అప్పగిస్తే, సంక్ఝేమం జోడుద్దుల బండిగా పయనిస్తోందని చెప్పారు. 
narendea modi punches on chandrababu and his corruption కోసం చిత్ర ఫలితం
*ఏపీలో 3 లక్షల కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని నరేంద్ర మోదీ పేర్కొన్నారు 
*పోలవరం ప్రాజెక్టుకు నిధులిస్తున్నా పనులు మాత్రం నత్తనడకన కొనసాగుతున్నాయని చెప్పారు. 
*రాయలసీమ అభివృద్ది కోసం నరసింహా రెడ్డి పోరాడితే ఆ ప్రాంత టిడిపి నేతలే ప్రజలకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. 
*గుక్కెడు నీళ్ల కోసం సీమ ప్రజలు అల్లల్లాడటానికి చంద్రబాబు పాలన కారణం కాదా? అని కూడా మోదీ ప్రశ్నించారు. 
*ఏపీలో ఎన్ఐటీ, ఐఐటీ, ట్రైబల్ యూనివర్సిటీ, కర్నూలులో మెగా సోలార్ ప్రాజెక్టు, పెట్రోలియం వర్సిటీ,  ఐఐఎఫ్సీటీ ,అనంతపురంలో కేంద్రీయ వర్సిటీ కేటాయించినట్టు, కర్నూలులో మెగా సోలార్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది తానేనని మోదీ గుర్తుచేశారు. 
* పోలవరానికి జాతీయ హోదా ఇచ్చింది మీ చౌకీదార్ అని నొక్కి వక్కానించారు మోదీ. 
సంబంధిత చిత్రం
ఏపీ అభివృద్ధి కోసం చేయూతనిస్తానని కానీ అందుకు సీఎం చంద్రబాబు సహకరించడం లేదని కూడా నరేంద్ర మోదీ మరో సంచలన కామెంట్ చేశారు. ఏపీ కోసం నిధులు పథకాలు ఇచ్చేందు కు సిధ్దంగా ఉన్నా, చంద్రబాబు సహకారం లేదని చెప్పారు. మొత్తంగా చంద్రబాబును టార్గెట్ చేసిన మోదీ పలు ఆసక్తికర అంశాలనే ప్రస్తావించారు.
lokesh chandrababu కోసం చిత్ర ఫలితం

ఏపిలో సన్ (son) సెట్ అయితేనే సన్(sun) రైజ్ మొదలౌతుందని - అంటే ఏపిలో పుత్ర రాజకీయ అస్తమయంతోనే, అభివృద్ధి  సూర్యోదయం జరుగుతుందని సెటైర్ పేల్చారు నరేంద్ర మోడీ.  

మరింత సమాచారం తెలుసుకోండి: