తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీలపై ఓ రేంజ్‌లో పైర్ అయ్యారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తీరుపై జోరుగా విమర్శలు చేశారు. ఓట్లు, రాజకీయాల కోసం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. 


కేసీఆర్ ఏమన్నారంటే.. 
మహబూబ్‌నగర్‌లో మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడిండు. మోదీ దుర్మార్గంగా మాట్లాడిండు. ఓట్ల కోసం బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసింది 118 నియోజకవర్గాల్లో.. 118 సీట్లకు పోటీ చేస్తే గెలిచింది ఒక్క సీటు. 103 సీట్లలో డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. అయినా బీజేపీ నేతలు దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. 

బీజేపీ నేత లక్ష్మణ్‌ కేసీఆర్ పదహారు సీట్లలో గెలిచి ఢిల్లీ వెళ్లి ఏమీపీకలేడు అంటున్నాడు.. సరే మరి ఈయనకు అధికారం ఐదేళ్లు ఇచ్చాం కదా.. ఏంపీకారు.. అంటూ ప్రశ్నించారు. లక్ష్మణ్ అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్ భరతం పడుతారంటా. నాకున్న సమాచారం ఏంటంటే బీజేపీ 150 సీట్లు, కాంగ్రెస్ 100 సీట్లకు మించి రావు. మే 23 తర్వాత ప్రాంతీయ పార్టీలే దేశాన్ని పాలించబోతున్నాయి అని సీఎం కేసీఆర్ తెలిపారు.

కాంగ్రెస్ లేని భారతదేశం కావాలని మోదీ అంటుంటే, బీజేపీ లేని భారతదేశం కావాలని కాంగ్రెసోళ్లు అంటున్నారు. ఇక ఎన్నికల్లో టికెట్లు అమ్ముకునే సంస్కృతి కాంగ్రెస్‌ది అంటూ ఆ పార్టీపైనా  సీఎం కేసీఆర్ ఘాటు విమర్శలు చేసారు. నల్లగొండలో టీఆర్‌ఎస్ ఒక్క సీటు గెలిచినా.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని చెప్పిండు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే దాకా గడ్డం తీయను అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడు. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు కానీ వీరంతా ఏంచ చేశారు  అంటూ కేసీఆర్ పంచ్‌ స్పీచులతో అదరగొట్టేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: