లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఆంధ్రప్రదేశ్‌లో విడుదల కాలేదు. తెలంగాణలో విడుదలై.. మంచి టాక్ తెచ్చుకుంది.. అయితే కీలకమైన ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఈ సినిమా విడుదల కాలేదు. టీడీపీ నాయకులు కొందరు ఈసీని ఆశ్రయించడంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. 

ఈ సినిమాపై ఎన్నికల ప్రచారంలో ఉన్న జగన్ స్పందించారు. మహానాయకుడు, కథానాయకుడు సినిమాలకు లేని అభ్యంతరం ఈ సినిమాపై ఎందుకు అన్నారు.  తెలుగుదేశం పాలనలో జన్మభూమి కమిటీల అరాచకం సాగుతుందన్నారు జగన్. 

మళ్లీ తెలుగుదేశం అధికారంలోకి వస్తే.. మనం ఏ సినిమా చూడాలో  కూడా వారే నిర్ణయిస్తారనన్నారు. మనం ఏ పేపర్ చదవాలో.. ఏ సినిమా చూడాలో.. ఏ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలో కూడా జన్మభూమి కమిటీలే నిర్ణయించే దుస్థితి వస్తుందని జగన్ కామెంట్ చేశారు. 

లక్ష్మీఎస్ ఎన్టీఆర్ సినిమా టీడీపీ వ్యవస్థాపకుడి జీవిత కథ అని.. దాన్ని కూడా చూడనీయకుండా అడ్డుపడుతున్నారని జగన్ ఎద్దేవా చేశారు. మరోసారి చంద్రబాబు అధికారంలోకి వస్తే.. అరాచకాలే కొనసాగుతాయని.. జనం ఆలోచించి ఓటేయాలని జగన్ విజ్ఞప్తి చేస్తున్నారు. జగన్ లక్షీస్ ఎన్టీఆర్ సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు జనం విజిల్స్ వేసి ఉత్సాహపరిచారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: