ఏపీలో ప్రచారం జోరు బాగా పెరిగింది. పోలింగ్ కు కచ్చితంగా పది రోజుల సమయం మాత్రమే ఉండడంతో అన్ని పార్టీలు జనంలోకి వచ్చేశాయి. వేసవి ఎండను అధినేతలు ప్రసంగాలు ఉంటున్నాయి. హాట్ కామెంట్స్ చేస్తూ పంచ్ డైలాగులు విసురుతూ ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.  


ఇక ఏపీలో మొన్నటి వరకూ చూసుకుంటే జగన్ రోజుకు నాలుగు మీటింగులు అటెండ్ చేశారు. చంద్రబాబు రాత్రి పొద్దుపోయేవరకూ ఉంటూ అయిదారు సభల్లో పాల్గొనేవారు. దాంతో ప్రచాంలో టీడీపీ ముందుంది అనిపించింది. అయితే నిన్నటి నుంచి సీన్ మారింది. ఓ వైపు జగన్ నాలుగు మీటింగులు అటెండ్ చేస్తూంటే ఆయన మాత్రుమూర్తి  విజయమ్మ రోజుకు మూడు  సభల్లో పాలుపంచుకుంటున్నారు. ఇక బస్సు యాత్ర పేరుతో షర్మిల మొత్తం కోస్తా జిల్లాలను చుట్టేస్తున్నారు. లేటెస్ట్  పరిణామతో వైసీపీ స్పీడ్ ఒక్కసారిగా పెరిగింది.


ఇక ఏపీలో నిన్న జరిగిన ఈ ముగ్గురి సభలన్నీ జనంతో కళకళలాడాయి. విజయసమ్మ సభలు సైతం అనూహ్యంగా పెద్ద  ఎత్తున జనం రావడం ఆసక్తిని కలిగించింది. ఇక జగన్ కి జనం ఎపుడూ ఉంటారు. రాత్రి తొమ్మిదిన్నర తరువాత షర్మిల మంగళగిరిలో మీటింగ్ పెడితే ఇసుకవేసే రాలనంతగా జనం వచ్చారు. దీన్ని బట్టి చూస్తే సీమ, కోస్తా అన్న తేడా లేకుండా వైసెపీఎకి జన ప్రభంజనం గట్టిగా ఉన్నట్లు కనిపిస్తోంది. మరి మిగిలిన రోజుల్లో ఈ జోరు ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: