ఐదేళ్లు పసుపు కుంకం.. సెల్లు.. ఇప్పుడు పదేళ్లు మళ్లీ సెల్లిస్తున్నాడు.. మా చంద్రబాబు నాయుడు.. మాయన్నయ్య.. ఓహో.. మరి ఓటెవరికి వేస్తారు.. జగన్‌ బాబుకి.. హ..హ..హ... ఐదేళ్లు పసుపు కుంకం.. సెల్లు.. ఇప్పుడు పదేళ్లు మళ్లీ సెల్లిస్తున్నాడు.. మా చంద్రబాబు నాయుడు.. మాయన్నయ్య.. ఓహో.. మరి ఓటెవరికి వేస్తారు.. జగన్‌ బాబుకి.. హ..హ..హ...


ఇదీ ఇటీవల టిక్ టాక్ వీడియోల్లో వైరల్ అవుతున్న వీడియో.. ఎన్నికల సమయంలో మీడియా జనం నాడి తెలుసుకునేందుకు జనంలోకి వెళ్లడం మామూలే కదా. అలా వెళ్లి ఓ రిపోర్టర్ ఓ మహిళను అడిగాడు. ఆ మహిళ చంద్రబాబుపై అభిమానం కురిపించింది. మా అన్నయ్యగా చెప్పుకుంది. 

పాపం. మరి ఓటెవరికి అంటే.. జగన్ బాబుకు అని చెప్పేసింది.. మరి మనసులో అభిమానం దాగుందో.. పొరపాటున చెప్పిందో తెలియదు..కానీ ఈ వీడియో చూసేందుకు చాలా నవ్వు తెప్పిస్తోంది. ఇప్పుడు దీన్ని వైసీపీ అభిమానులు టిక్ టిక్ ఆడియోగా మార్చేశారు. 

దీనికి టిక్ టాక్ ద్వారా పేరడీ వీడియోలు జోడించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ ప్రయోగాలు.. ఒక్క వైసీపీకే పరిమితం కాలేదు. ప్రధాన పార్టీల సోషల్ మీడియా విభాగాలు ఇలాంటి పనుల్లో తెగ బిజీగా ఉన్నారు. ఎవరికి దొరికిన వీడియోలను వారు వైరల్ చేస్తున్నారు. అంటే ఎలక్షన్ కామెడీ టిక్ టాక్‌ను కూడా వదల్లేదన్నమాట. 



మరింత సమాచారం తెలుసుకోండి: