ఎన్నికలు అన్నవి లాంచనమే. ఎందుకంటే అయిదేళ్ళ పాటు నాయకులు, వారి పాలన తీరు తెన్నులు ప్రతీ రోజూ ఓటర్లు గమనిస్తూ ఉంటారు. అయితే ఓ షెడ్యూల్ పెట్టుకుని ఎన్నికలు నిర్వహించడం, ప్రచారం కోసం సమయం ఇవ్వడం వంటివి షరా మామూలు వ్యవహారం. ఎవరేమిటన్నది అప్పటికపుడు చెబితే తెలుసుకోలేరంత అమాయకులు కాదు ఓటర్లు.


ఓ ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ మాట్లాడుతూ భారతీయ ఓటర్లు ఎవరికి ఓటు వేయాలన్నది ఎపుడో డిసైడ్ అయిపోయారని చెప్పారు. బీజేపీని ఈసారికి గెలిపించాలని అనుకుంటున్నట్లుగా మోడీ చెప్పుకొచ్చారు. మొత్తానికి చూస్తే 300 పైగా ఎంపీ సీట్లు తమ పార్టీకి వస్తాయని కూడా మోడీ గట్టి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఎపుడు ఒక్కటిగా లేవని, అవి అలా ఉండలేవని కూడా అయన విశ్లేషించారు. మోడీ ధీమా అలా ఉంటే తొలి విడతలో ఎన్నికలను ఎదుర్కొంటున్న ఏపీ పరిస్తితి ఎలా ఉందన్నది అందరికీ ఆసక్తికరంగా ఉంది.


ప్రధాని చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఏపీలో కూడా ఓటర్లు తమ తీర్పుని మెదళ్ళలో నిక్షిప్తం  చేసుకున్నారా అనిపిస్తోంది. మరో పది రోజుల్లో పోలింగుకు వెళ్ళబోతున్న వేళ ఏపీ ఓటర్లు ఎటు వైపు ఉన్నారు, వారి మౌనం వెనక దాగున్న బ్రహ్మాస్త్రం  ఏంటి ఎవరి మీదకు దాన్ని ప్రయోగించనున్నారన్నది ఇపుడు చర్చనీయాశం గా ఉంది. మరి ఇక్కడ హోరాహోరీగా సాగుతున్న పోరులో బాబు గెలుస్తారా, జగన్ గెలుస్తారా. మోడీ మాదిరి ధీమా ఎవరికి ఉంది అన్నది కూడా ఇంటెరెస్టింగ్ పాయింట్.


మరింత సమాచారం తెలుసుకోండి: