ఎన్నికల్లో స్లోగన్ అంటే గన్ లా పనిచేయాలి. ప్రత్యర్ధి శిబిరాన్ని కకావికలం చేయాలి. అనుకున్న టార్గెట్ ని చేదించాలి. జనాల మెదళ్ళను కదిలించాలి. అపుడే ప్రతికూలమైనా కూడా అనుకూలంగా మారిపోతుంది. ఏపీలో ఇపుడు కొత్త స్లోగన్లు ఎన్నో వస్తున్నాయి.


జగన్ తన స్పీచ్ ని మార్చుకున్నారు. గత పది రోజులుగా ఆయన స్టైల్ వేరుగా ఉంది. మీ సమస్యలు అన్నీ  నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను.. ఇదీ జగన్ స్లోగన్.  ఇది విపరీతంగా జనంలోకి పోతోంది. ఎందుకంటే జగన్ సుదీర్ఘ పాదయాత్ర చేయడం. ప్రతి వ్యక్తితో కలసిమెలిసి ముందుకు సాగడం అనే నేపధ్యం ఉంది. ఆ విధంగా చూసుకున్నపుడు జగన్ చెప్పిన మాటలు అక్షర సత్యాలు. నేను ఉన్నాను అన్నది కొండంత భరోసా. దాంతో జగన్ ప్రతీ సభలో ఈ స్లోగన్ సూపర్ హిట్ అవుతోంది.


ఇక నిన్నటి నుంచి ప్రచారం మొదలుపెట్టిన షర్మిల నెగిటివ్ స్లోగన్ ఎంచుకున్నారు. అది బాబుకు యాంటిగా ఉంది. బాబు చేసిన తప్పులు, తప్పిదాలను సభలో ఏకరువు పెడుతూ ప్రతి విమర్శ చివరల్లో బై బై బాబూ అనడంటో జనాలకు బాగా కనెక్ట్ అవుతోంది. ఇన్ని రకాలైన ఫెయిల్యూర్స్ చేసిన బాబు ఇక్న మాకు నీవు వద్దు బై బై అంటూ షర్మిల ఇస్తున్న స్లోగన్ ఒక్కసారిగా మెదళ్ళకు ఎక్కిపోయేదే. మంగళగిరి సభలో షర్మిల కొత్త స్లోగన్ కి జనం గుర్తు కలపడంతో ఇక బై బై బాబు మరింతగా  జనం గుండెలను తట్టి రేపుతుందో ముందు ముందు మీటింగులల్లో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: