అదేంటి ఐదు కోట్ల ఆంధ్రులకు  ముఖ్యమంత్రి చంద్రాబాబు. ఆయన ఒంటరి అయిపోవడం ఏంటి అన్న సందేహాలు రావచ్చు. పైగా ఆయనకంటూ పెద్ద ఫ్యామిలీ ఉంది. పెద్ద బలం, బలంగం అన్నీ ఉన్నాయి. బాబు అంటేనే ఏపీ, ఏపీ అంటేనే బాబు. మరి ఆయన ఒంటరి కావడం ఏంటి.


నిజమే బాబుకు చెప్పుకోవడానికి ఎందరో ఉన్నారు. కానీ కీలకమైన ఎన్నికల వేళ ఎవరూ కలసిరావడంలేదు. డెబ్బయ్యేళ్ల వయసులో చంద్రబాబు ఒక్కరే ఎన్నికల ప్రచారాన్ని ఒంటి చేత్తో మోస్తున్నారు. రాత్రి పది వరకూ ఆయన సభల్లో పాల్గొని తిరిగి ఉదయం అంతా పార్టీ మీటింగులు, సలహాలు, వ్యూహాలు అన్నీ సిధ్ధం చేసుకుంటున్నారు. ఇక మధ్యాహ్నం నుంచి సభలకు వెళ్తున్నారు. గత అది రోజులుగా బాబు షెడ్యూల్ ఇదే. ఇక బాబుతో సహకరించి ప్రచారం చేసే వారు ఆ పార్టీలో ఎవరూ లేరా అంటే లేరనే మాట వినిపిస్తోంది.


బాబు కొడుకు, మంత్రిగా ఉన్న లోకేష్ మీద ఆధారపడదాం అంటే ఆయన తప్పుల తడక ప్రసంగాలు చేస్తున్నారని కామెంట్స్ వస్తున్నాయి. ఆయన ప్రతి మీటింగులో పదుల్లో తప్పులు, పొరపాట్లు దొర్లుతూంటే అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో పాజిటివ్ బజ్ కి బదులు నెగిటివ్  వైబ్రేషన్లు వేగంగా జనంలోకి వెళ్ళిపోతున్నాయి. ఇక పార్టీలో నాయకులు ఎంతో మంది ఉన్నా ఎవరికీ పెద్దగా ఫేస్ వాల్యూ లేదు. గట్టిగా మాట్లడే వారంతా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. దాంతో బాబుకు ఒంటరి  పోరు తప్పడం లేదంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: