ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఓవైపు జగన్, మరోవైపు చంద్రబాబు సుడిగాలి పర్యటనలు చేస్తూ రోజుకు ఐదారు సభలు కవర్ చేస్తున్నారు. మరోవైపు. జగన్‌కు తోడుగా ఇప్పటికే ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల కూడా రంగంలోకి  దిగారు. 


చంద్రబాబు ఐదేళ్ల పాటు ప్రజలను మోసం చేశారని, ఇప్పుడు ఆయనను ఓడించే సమయం వచ్చిందని, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ ఎప్పుడూ జనంలోనే ఉన్నారని, అందువల్ల ఆయనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని విజయమ్మ, షర్మిల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. సింహం ఒంటరిగానే పోటీ చేసి గెలుస్తుందని ధైర్యంగా చెబుతున్నారు. 

పదవి ప్రజాసేవకు ఒక అవకాశమని రాజశేఖరరెడ్డి భావించి పాలించారని విజయమ్మ, షర్మిల గుర్తుచేశారు. చరిత్ర, చరిత్ర అని చంద్రబాబు అంటారని, ఆయన పాలనలో వ్యవసాయమనేది ఒక చర్రిత అవుతుందేమోనన్న భయం రైతులను వెన్నాడుతోందని వారు పేర్కొన్నారు. వీరి ప్రచారానికి మంచి స్పందన కనిపిస్తోంది. 

మరోవైపు చంద్రబాబుకు నారా లోకేశ్ మైనస్ గా మారుతున్నారు. రోజురోజూ..ఆయన మాట్లాడే తప్పులతో ప్రత్యర్థులు ఆయన పరువు తీస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్‌ చేస్తూ లోకేశ్ అసమర్థుడనే ప్రచారం జోరు పెంచారు. దీంతో లోకేశ్ ప్రచారంతో బాబుకు మైలేజ్ రాకపోగా.. మరింత మైనస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: